తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయినా గానీ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు భారత పేసర్ మహ్మద్ సిరాజ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీమిండియా నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓడిపోయిందని బలంగా చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
మహ్మద్ సిరాజ్.. తన పదునైన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తుంటాడు. గత కొంత కాలంగా వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేస్తూ.. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ గా ఎదిగాడు సిరాజ్. ఇక తాజాగా ఆసిస్ తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. మూడు టెస్టుల్లో ఏ మ్యాచ్ లోనూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేదు. పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తుండటంతో ఈ పేసర్ బౌలింగ్ లో తేలిపోయాడు. అయితే తాజాగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకున్నాడు మహ్మద్ సిరాజ్. ఆసిస్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డిండ్ చేస్తున్న క్రమంలో అభిమానులు సిరాజ్ భాయ్ అంటూ కేకలు పెట్టారు.
ఈ క్రమంలోనే అందులోంచి ఓ అభిమాని దాహంగా ఉంది తాగడానికి ఎనర్జీ డ్రింక్ ఇవ్వమని గట్టిగా అరిచాడు. దాంతో ఆ అభిమాని మాటలు విన్న సిరాజ్ పక్కనే ఉన్నసిబ్బంది దగ్గర తాను తాగడానికి ఉంచుకున్న డ్రింక్ ను సదరు అభిమానికి ఇచ్చాడు. దాంతో అక్కడి ఫ్యాన్స్ ఇంకా గట్టిగా అరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన కొంత మంది అభిమానులు.. నువ్వు సూపర్ భయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు. సిరాజ్ చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారు. మరి అభిమాని దాహం తీర్చిన హైదరాబాదీ స్పీడ్ స్టర్ సిరాజ్ మంచి మనసు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#INDvsAUSTest#siraj
Siraj gave energy drink to his fan pic.twitter.com/Vu3VE298z1— 𝐀𝐊𝐀𝐒𝐇 𝐘𝐀𝐃𝐀𝐕 (@Akash_Yadav_18) March 2, 2023