స్టార్ బౌలర్ షమి త్వరలో అరెస్ట్ కానున్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇతడి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇప్పుడది కాస్త కీలక మలుపు తీసుకుంది.
టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. తాజాగా దిల్లీతో మ్యాచ్ లో రెచ్చిపోయి మరీ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. త్వరలో జరగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో షమిపై అంచనాలు గట్టిగానే ఉంది. ఇలా క్రికెట్ కెరీర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ… వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. ఇప్పుడది చాలదన్నట్లు భార్య మరో పనిచేసింది. ఇది కాస్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొస్తే.. 2013 నుంచి టీమిండియా, ఐపీఎల్ లో ఆడుతున్న షమి బౌలర్ గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 2019లో ఇతడి భార్య హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. తనని చాలా వేధిస్తున్నాడన చెప్పుకొచ్చింది. అయితే అవన్నీ నిరాధారం అని షమి చెబుతూ వచ్చాడు. దీంతో హసీన్ కోర్టుని ఆశ్రయించింది. అప్పటినుంచి ఈ కేసు న్యాయస్థానంలో ఉంది. దాదాపు మూడేళ్లపాటు నడిచిన ఈ కేసుపై, కోల్ కతా హైకోర్టు జనవరిలో ఓ తీర్పు ఇచ్చింది. ప్రతినెలా హసీన్ జహాన్ కు రూ.1.30 లక్షలు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో రూ 80 వేలు పిల్లల సంరక్షణ కోసం, రూ 50 వేలు భార్య కోసం అని చెప్పింది.
హైకోర్టు తీర్పుపై సంతృప్తి చెందని హసీన్ జహాన్.. తనకు రూ. 10 లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసింది. అలానే షమిని అరెస్ట్ చేయకుండా స్టే విధించారని, దాన్ని ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కట్నం విషయంలో తనని చాలాసార్లు వేధించాడని, అలానే టీమిండియా టూర్స్ కి వెళ్లినప్పుడు చాలామందితో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నాడని హసీన్ జహాన్.. షమిపై మరోసారి ఆరోపణలు చేసింది. ఇదంతా చూస్తుంటే త్వరలో షమి అరెస్ట్ కానున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. షమి-హసీన్ జహాన్ ఫ్యామిలీ గొడవపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.