టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రికి టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ బిర్యానీ పంపించాడు. దాన్ని శాస్త్రి ఎంతో ఆస్వాదిస్తూ తింటూ.. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో తెలిపారు. ఇటివల రంజాన్ పండుగ సందర్భంగా రవిశాస్త్రి షమీ, మొహమ్మద్ సిరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పండుగ సందర్భంగా షమీ శాస్త్రికి ఆయనకు ఎంతో పసందైన బిర్యానీని పంపించారు. అలాగే సిరాజ్ ఇంకా బిర్యానీ బాకీ ఉన్నాడని రవిశాస్త్రి సరదాగా అన్నారు.
కాగా.. రవిశాస్త్రి టీమిండియా కోచ్‌గా ఉన్న సమయంలో ఆటగాళ్లతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కోహ్లీ, షమీ, సిరాజ్‌లతో శాస్త్రికి మంచి సాన్నిహిత్యం ఉంది. టీమిండియా కోచ్ పదవి గడువు ముగిసిన తర్వాత కొంత విరామం తీసుకున్న రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. షమీ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉండడంతో శాస్త్రితో కలిసి పార్టీ చేసుకోలేని షమీ ఇలా బిర్యానీ ట్రీట్ ఇచ్చాడు. మరి సిరాజ్ ఎప్పుడు పార్టీ ఇస్తాడో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Warner: వీడియో: విచిత్రమైన షాట్ ఆడిన వార్నర్! దీనికి మీరే పేరు పెట్టండి
Shaaami, loving it 🤗 Thanks for the Biryani @MdShami11 @mdsirajofficial, yours is pending 😜 pic.twitter.com/qmKxLQeUaY
— Ravi Shastri (@RaviShastriOfc) May 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.