టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ బ్యాటింగ్ విషయంలో విరాట్ కోహీ కంటే ఒక విషయంలో మెరుగ్గా ఉన్నాడు. టెస్టుల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన కోహ్లీని సైతం వెనక్కి నెట్టి.. ఓ అరుదైన రికార్డు సాధించాడు. కోహ్లీ అభిమానులకు ఈ విషయం కోపం తెప్పించినా.. ఇది నిజం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌తో షమీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఒక్క కోహ్లీనే కాదు.. ప్రస్తుతం ఉన్న హేమాహేమీ బ్యాటర్లు కేఎల్ రాహుల్, పుజారాలు సైతం షమీ ముందు చిన్నబోయారు. ఇంతకు షమీ ఎలాంటి రికార్డ్ సాధించాడంటే.. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ కంటే కూడా ఎక్కువ సిక్సులు కట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నిజం. టెస్టుల్లో కోహ్లీ కంటే షమీనే ఎక్కువ సిక్సులు కొట్టాడు. ఇప్పటి వరకు 105 టెస్టులు ఆడిన కోహ్లీ.. 8131 పరుగులు, 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు చేసినా.. సిక్సులు మాత్రం ఇరవై నాలుగే(24) కొట్టాడు. 60 టెస్టులు ఆడి 685 రన్స్ మాత్రమే చేసిన షమీ.. 25 సిక్సులు బాదాడు.
టెస్టు క్రికెట్‌లో నిదానంగా ఆడుతూ.. గ్రౌండ్ లెవెల్ షాట్స్ ఆడుతూ.. కోహ్లీ టన్నుల కొద్ది పరుగులు చేసినా.. సిక్సుల విషయంలో మాత్రం షమీ, కోహ్లీ కంటే ముందున్నాడు. అలాగే భారత క్రికెట్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన 16వ బ్యాటర్ కూడా షమీనే. షమీ కంటే కోహ్లీ, రాహుల్, పురాజా, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు సైతం వెనుకబడి ఉన్నారు. కేల్ రాహుల్ ఇప్పటి వరకు 17 సిక్సులు కొట్టాడు. టీ20ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన యూవీ సైతం తన టెస్టు కెరీర్‌లో 21 సిక్సులు మాత్రమే కొట్టాడు. ఇలా.. ఓ స్టార్ పేసర్ టెస్టుల్లో స్టార్ బ్యాటర్లను దాటేసి ముందుకు వెళ్లడంతో.. క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. లబుషేన్ 49 రన్స్‌తో రాణించాడు. జడేజా 5, అశ్విన్ 3 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయింది. ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 120, అక్షర్ పటేల్ 84, జడేజా 70 పరుగులు చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించారు. తొలి రోజు చివరి సెషన్‌లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. మూడో రోజు తొలి సెషన్‌లో ఆలౌట్ అయింది. ఆసీస్ డెబ్యూ బౌలర్ టాడ్ మర్ఫీ 7 వికెట్లతో అదరగొట్టాడు. ఇక మూడో రోజు రెండో సెషన్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌ను అశ్విన్ వణికిస్తున్నాడు. ఇప్పటికే 5 వికెట్ల హాల్ సాధించిన అశ్విన్ బాల్‌ను గింగిరాలు తిప్పుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్మిత్, కమిన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 159 పరుగులు వెనుకబడి ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రదర్శనతో పాటు షమీ బ్యాటింగ్, సిక్సుల విషయంలో కోహ్లీని దాటేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shami#INDvAUS pic.twitter.com/rDgAoGu4EU
— RVCJ Media (@RVCJ_FB) February 11, 2023