బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆసిస్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ కుర్ర అభిమాని తన అభిమాన ఆటగాడిని కలవడానికి సెక్యూరిటీని దాటుకుని, బారీ కేడ్లు దూకి.. గ్రౌండ్ లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలోనే..
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్యాన్స్ తమ అభిమాన ఆటగాడి కోసం సెక్యూరీటిని దాటుకుని గ్రౌండ్ లోకి రావడం, ప్రేమికులు లవ్ ప్రపోజ్ చేసుకోవడం, కిస్సింగ్ సీన్ లు మనం చాలానే చూశాం. ఇక గ్రౌండ్ లో అయితే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, కొన్ని సార్లు ఘర్షణలు జరగడం కూడా మనకు తెలుసు. అయితే తాజాగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తన అభిమాన ఆటగాడిని కలవడానికి దూసుకొచ్చాడు ఓ కుర్ర అభిమాని.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఇండియా-ఆసిస్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్ట్ విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా అదే జోరును ఈ మ్యాచ్ లోనూ కొనసాగిస్తోంది. భారత బౌలర్లకు ఆసిస్ బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పడుతున్నారు. ఇక తొలి రోజు మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకోవడంతో ఆట కొద్దిసేపు నిలిపి వేశారు. వివరాల్లోకి వెళితే.. ఆసిస్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ కుర్ర అభిమాని తన అభిమాన ఆటగాడిని కలవడానికి సెక్యూరిటీని దాటుకుని, బారీ కేడ్లు దూకి.. గ్రౌండ్ లోకి పరిగెత్తాడు.
ఈ క్రమంలో ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, అతడిని పిచ్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ ఫ్యాన్ ను బలంగా బయటకి లాగుతున్నారు. ఇది గమనించిన టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ.. ఆ కుర్రాడి దగ్గరికి వచ్చి, సెక్యూరిటీని నుంచి విడిపించాడు. అతడితో మాట్లాడి నిదానంగా ఆ ఫ్యాన్ ను పంపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో క్రికెట్ అభిమానులకు ఆటగాళ్లు ఎంత గౌరవం ఇస్తారో ఇదే నిదర్శనం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక షమీ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే ఆ ఫ్యాన్ ఏ ఆటగాడి కోసం వచ్చాడో మాత్రం తెలియరాలేదు. మరి క్రికెట్ ఫ్యాన్ పై షమీ చూపిన ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A pitch invader enters the field in Delhi!
😮#pitchinvader #delhi #mohammedshami #testmatch #indvsaus #india #cricketuniverse pic.twitter.com/dwDAMjdYHp— Cricket Universe (@CricUniverse) February 17, 2023