టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కెరీర్లో తిరిగి ఫామ్‌లోకి వచ్చి అదరగొడుతున్నాడు. అటు పర్సనల్ లైఫ్‌లోనూ షమీ ఫుల్ జోష్ మీదున్నాడు. మొదటి నుంచి షమీకి బైక్స్, కార్లు అంటే బాగా క్రేజ్. ఇటీవలే రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650ని యూపీ నుంచి తెప్పించుకున్నాడు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పంచుకున్నాడు. ఇప్పుడు షమీ గరాజ్‌లోకి మరో ఖరీదైన కారు చేరింది.
షమీ కొనుగోలు చేసిన ఎరుపు రంగు జాగ్వార్-F టైప్ మోడల్ కారుని శుక్రవారం షోరూమ్ వాళ్లు డెలివరీ చేశారు. జాగ్వార్ ఎఫ్-టైప్ కూప్ మోడల్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగలదు. 5.7 సెక్లలోనే 0 నుచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ జాగ్వార్ ఎఫ్ టైప్ కూప్ కారు ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ.98.20 లక్షలుగా ఉంది. ఇప్పటికే షమీ గరాజ్ లో టయోట ఫార్చునర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి కార్లు ఉన్నాయి.
షమీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో 150 వికెట్ల క్లబ్ లో చేరిపోయాడు. 80 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న తొలి టీమిండియా బౌలర్‌గానూ షమీ పెరుగాంచాడు. షమీ కొనుగోలు చేసిన జాగ్వార్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.