ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక డిఫరెంట్ టీమ్.. అన్ని జట్లు తమకంటూ ఒక స్టార్ ప్లేయర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంచుతూ.. ఫ్యాన్‌బేస్ పెంచుకుంటూ పోతుంటే.. ఎస్‌ఆర్‌హెచ్ అందుకు భిన్నంగా జట్టుకు ఇంటర్‌ఫేస్‌గా మారిన ఆటగాళ్లను అవమానకరంగా బయటికి పంపిస్తుంటుంది. టీమ్‌కు టైటిల్ గెలిచిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ విషయంలో సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సొంత ఫ్యాన్స్ సైతం మండిపడ్డారు. వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్‌ను నుంచి కెప్టెన్సీ లాక్కొవడంతో పాటు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి ఘోరంగా అవమానించింది. అయినా కూడా టీమ్‌ను ఓన్ చేసుకున్నా వార్నర్.. టీమ్‌లో కొనసాగాడు. కానీ.. అవమానాలు మరింత ఎక్కువ కావడం ఎస్‌ఆర్‌హెచ్‌ను వదిలివెళ్లిపోయాడు.
వార్నర్ తర్వాత అఫ్ఘానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఎస్‌ఆర్‌హెచ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా మారాడు. అతన్ని కూడా ఐపీఎల్ 2021 తర్వాత వదులుకుంది. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ 2023కు ముందు కేన్ విలియమ్సన్‌ను వదులుకున్న ఎస్‌ఆర్‌హెచ్ మరోసారి తమ టీమ్‌కు బ్రాండ్‌లా ఉన్న కేన్ మామను వదులుకుంది. ఇలా వరుసగా ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తున్న సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. సోషల్ మీడియాలో వారి ఆగ్రహాన్ని సైతం చవిచూసింది. ఇప్పుడు ఇదే విషయంపై సన్‌రైజర్స్ మాజీ ప్లేయర్ అఫ్ఘానిస్థాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ నబీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదారబాద్ టీమ్‌ను నాశనం చేయకుండా.. పటిష్టం చేయాలని చూచించాడు.
నబీ మాట్లాడుతూ..‘2016 తర్వాత కొన్ని ఏళ్ల పాటు సన్‌రైజర్స్ టీమ్ బాగా సెట్ అయింది. కానీ.. ఆ తర్వాత అనేక మార్పులతో టీమ్‌ను చెడగొట్టాడరు. ఒక పెద్ద ఫ్రాంచైజ్‌గా ఉన్న సన్‌రైజర్స్.. జట్టును పటిష్టం చేసుకోవాలి. రషీద్ ఖాన్ ఐదేళ్ల పాటు వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు. కానీ.. వాళ్లు అతన్ని కూడా నిరాశ పర్చి.. జట్టు వీడి వెళ్లిపోయేలా చేశారు. అసలు వారి ఏం కావాలో కనీసం వారికైనా అర్థం అవుతుందో లేదో.. ’ అని నబీ పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ 2021 తర్వాత సన్‌రైజర్స్ నబీని వదిలేసింది. 2022లో నబీని కోల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసినా.. మ్యాచ్‌లు ఆడించలేదు. ఇక ఐపీఎల్ 2023 కోసం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో నబీ అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. మరి సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై నబీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Is something wrong with the SRH management? #MohammadNabi #Nabi #RashidKhan #Cricket #IPL #GoSportiqo pic.twitter.com/tpnUumhD18
— Sportiqo (@sportiqomarket) December 29, 2022