సాధారణంగా క్రికెట్ లో ఓ బ్యాటర్ పరుగులు రాబట్టాలి అంటే కచ్చితంగా బ్యాటింగ్ శైలిలో టెక్నిక్ ఉండాలి. ప్లేయర్ కు బ్యాటింగ్ లో టెక్నిక్ లేకపోతే రన్స్ చేయడం కష్టం అవుతుంది. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్ లో టెక్నిక్ లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్. టెక్నిక్ లేనప్పటికీ అతడు క్రికెట్ లో అద్భుతంగా రాణించి స్కోర్ చేశాడని కైఫ్ అన్నాడు. ఇక ఇలాగే మరో టీమిండియా బ్యాట్స్ మెన్ కు కూడా బ్యాటింగ్ లో టెక్నిక్ లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడు భారత్ జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
” నా ఇన్ని సంవత్సరాల క్రీడా అనుభవంలో ధోని బ్యాటింగ్ లో నాకు ఎన్నడూ టెక్నిక్ కనిపించలేదు. నాకే కాదు వరల్డ్ క్రికెట్ లో చాలా మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహీకి టెక్నిక్ లేకపోయినప్పటికీ అతడికి పరుగులు ఎలా రాబట్టాలో తెలుసు అందుకే అన్ని రన్స్ చేశాడు.. టీమిండియాకు విజయాలను అందించాడు” అని ధోని బ్యాటింగ్ ను కొనియాడాడు కైఫ్. అయితే ధోని లాగే మరో టీమిండియా బ్యాట్స్ మెన్ కు సైతం బ్యాటింగ్ లో టెక్నిక్ లేదని చెప్పుకొచ్చాడు. అతడే భారత జట్టులో కంటిన్యూస్ గా పరుగులు సాధిస్తూ స్టార్ బ్యాటర్ గా ఎదుగుతున్న శ్రేయస్ అయ్యర్. అవును అయ్యర్ బ్యాటింగ్ శైలిలోనూ టెక్నిక్ లేదని కైఫ్ వ్యాఖ్యానించాడు.
కానీ అతడికీ టెక్నిక్ లేకపోయినప్పటికీ ధోని లాగా పరుగులు చేసే సత్తా ఉందని ప్రశంసించాడు. ఇక అయ్యర్ కు ఏ ఫార్మాట్ కు ఎలా ఆడాలో అద్భుతంగా తెలుసని ప్రశంసించాడు. అయితే అయ్యర్ కు ఉన్న ఒకేఒక వీక్ నెస్ ఉంది.. అదే బౌన్సర్లు ఆడటం అని కైఫ్ పేర్కొన్నాడు. ఈ వీక్ నెస్ అయ్యర్ ను జీవితాంతం వెంటాడుతుంది. అయితే ఈ బలహీనతను తొలగించుకోవడానికి బదులు మరో దారిలో పరుగులు సాధించడం ఉత్తమం అని కైఫ్ సూచించాడు. ప్రస్తుతం అయ్యర్ ఇదే చేస్తున్నాడు అని కొనియాడాడు. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ విజయంలో అయ్యర్ చేసిన పరుగులు కీలకమైనవిగా కైఫ్ చెప్పుకొచ్చాడు.
“We always talk about Dhoni that he doesn’t look good but score runs and wins matches. Shreyas Iyer also has the same class, he knows how to make runs,” @MohammadKaif said. #BANvIND https://t.co/SX03cZo43k
— Circle of Cricket (@circleofcricket) December 19, 2022