టీమిండియా ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో పరాజయాలు, మరెన్నో విజయాలు సాధించింది. అన్నీ మ్యాచ్ లు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందలేవు. కానీ, ఈ మ్యాచ్ జరిగి 20 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికి ఆ మ్యాచ్ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ షర్ట్ తీసి గాల్లో తిప్పడం ఇప్పటికీ మర్పిపోలేదు. అదే 2002నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
లార్డ్స్ వేదికగా నాట్ వెస్ట్ ఫైనల్ జరిగి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఆ సందర్భంగా అప్పటి సంగతులు, విశేషాలను వెటరన్ ప్లేయర్లు మరోసారి నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా ఆ మ్యాచ్ హీరోలు మహ్మద్ కైఫ్- యువరాజ్ సింగ్ లైవ్ లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు అప్పడు ఏం జరిగింది? వారి మానసిక స్థితి ఎలా ఉంది అనే అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఆ రోజు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు మార్కస్(109), నస్సెర్ హుస్సేన్(115) ఇద్దరు సెంచరీలు బాదారు. 326 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా ఆటను ప్రారంభించింది. టీమిండియా ఓపెనర్లు సెహ్వాగ్(45), గంగూలీ(60) మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత పరిస్థితి తలకిందులు అయ్యింది. దినేశ్ మోంగియా(9), సచిన్ టెండూల్కర్(14), రాహుల్ ద్రవిడ్(5) వరుసగా పెవిలియన్ చేరారు.
Twenty years back I played an inning that gave me an identity, fame and love for a life time. Revisiting the 2002 Miracle of Lord’s with family and friends and answering the question that I always get asked – How did you manage to chase down 326? #Lord‘s #NatwestSeries pic.twitter.com/MYZoDQc9aH
— Mohammad Kaif (@MohammadKaif) July 13, 2022
సచిన్ ఔట్ అవ్వగానే అంతా మ్యాచ్ మీద ఆశలు వదులుకున్నారు. కానీ, క్రీజులో ఉన్న యువరాజ్ మాత్రం మంచి స్ట్రోక్స్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన కైఫ్.. “యువరాజ్ క్రీజులో ఉన్నాడు అంటే మ్యాచ్ పై ఆశలు ఇంకా బతికే ఉన్నాయి” అని తన పార్ట్నర్ లో ఉత్సాహాన్ని నింపాడు. ఆ సంఘటననే ఇప్పుడు యువీ, కైఫ్ మరోసారి సరదాగా గుర్తు చేసుకున్నారు.
Twenty years back I played an inning that gave me an identity, fame and love for a life time. Revisiting the 2002 Miracle of Lord’s with family and friends and answering the question that I always get asked – How did you manage to chase down 326? #Lord‘s #NatwestSeries pic.twitter.com/MYZoDQc9aH
— Mohammad Kaif (@MohammadKaif) July 13, 2022
ఇక ఆ మ్యాచ్ సమయంలో మహ్మద్ కైఫ్ యువరాజ్ తో అన్న మాటలు ఇప్పటికీ యువీ మర్చిపోలేదు. కైఫ్ రాగానే.. “ఆడదాం.. తప్పకుండా ఆడదాం. ఓడిపోతామని తెలిసినా ఆడదాం” అని కైఫ్ చెప్పినట్లు లైవ్ లో యువరాజ్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా సింగిల్ తీసి యువీకి బ్యాటింగ్ ఇవ్వమని గంగూలీ చెప్పినట్లు కైఫ్ చెప్పాడు.
#OnThisDay in 2002, Mohammad Kaif’s parents decided to turn their TV sets off and go for a movie when India were reduced to 146/5 chasing 326.
The. Rest. Is. His. Story. And India’s story. 🇮🇳🤌 pic.twitter.com/uoCbKOaGiE
— Rajasthan Royals (@rajasthanroyals) July 13, 2022
“నేను గ్రౌండ్ లోకి రాగానే దాదా బాల్కనీ నుంచి వేలు చూపిస్తూ సింగిల్ తీసి యువరాజ్ కి స్ట్రైకింగ్ ఇవ్వు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత షార్ట్ పిచ్ బాల్ రావడంతో నేను గట్టిగా పుల్ షాట్ ఆడాను. అది కాస్తా సిక్స్ వెళ్లింది. ఆ తర్వాత బాల్కనీ నుంచి ఎవ్వరూ మాట్లడలేదు. డ్రింక్స్ అప్పుడు నోట్ వస్తుంది అనుకున్నాను కానీ, నోట్ ఏం రాలేదు” అంటూ మహ్మద్ కైఫ్ అప్పటి విషయాలను నెమరు వేసుకున్నాడు.
2️⃣0️⃣ years since this iconic win at Lord’s 😍#OTD in 2002, a sensational partnership between Mohammed Kaif and Yuvraj Singh led #TeamIndia to victory in the final of the NatWest Series 🙌#OnThisDay pic.twitter.com/9JRh38bUxe
— SunRisers Hyderabad (@SunRisers) July 13, 2022
ఆ మ్యాచ్ ల యువరాజ్ సింగ్ 63 బంతుల్లో 69 పరుగులు చేయగా.. కైఫ్ 109 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 87 పరులుగు చేసి అజేయంగా నిలిచాడు. యువరాజ్, కైఫ్ ప్రదర్శనతో టీమిండియా 3 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ లో విజయం సాధించింద. అంతేకాకుండా ఆ మ్యాచ్ లో మహ్మద్ కైఫ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా లభించింది. ఆ మ్యాచ్ గురించి సచిన్, సెహ్వాగ్, గంగూలీలు సైతం మరోసారి గుర్తుచేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. లార్డ్స్ లో టీమిండియా న్యాట్‌వెస్ట్ ట్రోఫీ నెగ్గడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#OnThisDay in the 2002 NatWest series final, Sourav Ganguly wanted Mohammad Kaif to take a single, giving the strike to Yuvraj Singh
But the batter had other ideas 😅 (and the rest is history 🏆 https://t.co/W79N1P0p8c) 📹 courtesy Delhi Capitals / YouTube pic.twitter.com/pzjp3CGIfw
— ESPNcricinfo (@ESPNcricinfo) July 13, 2022