Asia Cup 2022: ఆసియా కప్ 2022 టోర్నీకి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 27 నుంచి టోర్నీప్రారంభం కానుండగా, ఆగస్టు 28న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే.. ఆయా బోర్డులు జట్లను కూడా ఎంపిక చేసాయి. అయితే.. గాయాల బెడద ఇరుజట్లను వేధిస్తోంది. ఇప్పటికే.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వగా.. పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ తరుణంలో పాకిస్తాన్ బోర్డు.. ఆఫ్రిదీ ప్లేస్‌లో నిషేధిత బౌలర్‌కు చోటు కల్పించింది.
పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది స్థానంలో ఆ జట్టు యువ పేసర్ మహ్మద్ హస్నైన్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎంపిక చేసింది. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాక్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హస్నైన్.. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎనిమిది వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు పాక్ హస్నైన్ తరపున ఆడాడు. వన్డేల్లో 18 వికెట్లు, టీ20ల్లో 17 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న ‘ది హండ్రెడ్ లీగ్’లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపు రావడంతో త్వరలోనే అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని తేలడంతో అతనిపై నిషేధం విధించింది పాక్ క్రికెట్ బోర్డు.
Mohammad Hasnain replaces injured Shaheen Afridi in Pakistan’s Asia Cup squad 🏏 pic.twitter.com/RDyZgk5nbN
— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2022
ఫిబ్రవరిలో జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022లో సిడ్నీ సిక్సర్స్ తరుపున ఆడిన హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు రావడంతో ఐసీసీకి ఫిర్యాదు చేశారు అంపైర్లు. బీబీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి వెళ్లే ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఐసీసీ, హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షించింది. ఈ సమీక్షలో హస్నైన్ బౌలింగ్ యాక్షన్, ఐసీసీ నియమావళికి విరుద్ధంగా ఉందని నిర్ధారించారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హస్నైన్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున ఆడుతున్న హస్నైన్‌ని ఆఖరి నిమిషంలో తుది జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆపై జూన్‌లో.. తన బౌలింగ్ యాక్షన్‌పై క్లియరెన్స్ తెచ్చుకున్న హస్నైన్, క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
Marcus Stonis accuses Mohammad Hasnain of chucking. Might be looking at some sanction from disciplinary committee. #TheHundred #Stoinis #MohammadHasnain #OvalInvincibles pic.twitter.com/AgnvcytE0I
— Blatantly.blunt (@ludoplayer) August 15, 2022
కాగా, ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీసులు లేకపోవడంతో ఐసీసీ టోర్నీల్లోనే పోటీపడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2021 పరాభవం తర్వాత రెండు జట్లు తొలిసారి తలబడుతుండడంతో ఈ మ్యాచ్‌కి ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. టికెట్లు హాట్ కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. ఇప్పటికే.. “ఎవరు గెలవబోతున్నారు..” అన్న విషయంపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విజయావకాశాలు ఎవరికి ఎక్కువుగా ఉన్నాయో?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
పాకిస్తాన్ జట్టు:
బాబర్ ఆజమ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ, ఉస్మాన్ ఖదీర్.