క్రికెట్‌లో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్‌రౌండర్ అనే చర్చలు ఎప్పుడూ జరుగుతుంటాయి. ముఖ్యంగా అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరనేది ప్రేక్షకులతో పాటు క్రికెట్ విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు కూడా డిస్కస్ చేస్తుంటారు. ఇతడండే ఇతడే బెస్ట్ బ్యాట్స్‌మన్ అంటూ కితాబిస్తుంటారు. బ్యాటింగ్‌లో చేసిన పరుగులు, ఆడిన మ్యాచులను బట్టి ఎవరు అత్యుత్తమో చెబుతుంటారు. ప్రస్తుత క్రికెట్‌లో ఈ లిస్టులో ఇద్దరు, ముగ్గురు ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ తరంలో విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లు ఉత్తమ బ్యాటర్లంటూ మాజీలు అంటున్నారు. గణాంకాల పరంగా ఈ లిస్టులో ఉన్న మిగతా బ్యాటర్ల కంటే విరాట్ కోహ్లీ ఎంతో ముందున్నాడు.
సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్‌లో అతడి వారసుడిగా విరాట్ కోహ్లీని అందరూ భావిస్తున్నారు. దశాబ్దం కంటే ఎక్కువకాలంగా టీమిండియాకు సేవలు అందిస్తున్న విరాట్.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఎన్నో అరుదైన మైలురాళ్లను చేరుకున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. అలాంటి కోహ్లీతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పోల్చడం ఈమధ్య ఎక్కువైపోయింది. విరాట్ స్థాయిలో కాకపోయినా బాబర్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. నిలకడైన ఆటతీరుతో పాక్‌ను బ్యాటర్‌గా, సారథిగా ముందుండి నడిపిస్తున్నాడు.
గతేడాది బాబర్ ఆజమ్ ప్రదర్శనకు గానూ రెండు ప్రముఖ అవార్డులు అతడ్ని వరించాయి. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీతో పాటు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2022 పురస్కారాలను బాబర్ అందుకున్నాడు. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడుతూ వెళ్తే గ్రేట్ క్రికెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీలు అంటున్నారు. అయితే కోహ్లీతో బాబర్ ఆజమ్‌కు పోలిక పెడుతూ కామెంట్స్ చేయడం ఇటీవల ఎక్కువైంది. తాజాగా భారత మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ చైర్మన్ అజహరుద్దీన్ ఈ ఇద్దరు బ్యాటర్లను పోలుస్తూ కామెంట్ చేశాడు. ‘ఇద్దరు ఆటగాళ్లను పోల్చడం అంటే చాలా కష్టం. వీళ్లిద్దరూ (విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్) వైవిధ్యమైన ప్లేయర్లు. కానీ ఇద్దరిలో కోహ్లీ కాస్త బెటర్’ అని అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. మరి, కోహ్లీ, బాబర్‌ల్లో ఎవరు బెస్ట్ అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Former Indian captain Mohammad Azharuddin gives Virat Kohli an edge over Babar Azam.#ViratKohli #BabarAzam #India #Pakistan #Cricket pic.twitter.com/Gz117XpNzJ
— CricTracker (@Cricketracker) January 30, 2023