టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంటే.. అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఐపీఎల్ మ్యాచ్ బెంగుళూరు వెదకగా జరుగుతోంది అంటే..మ్యాచ్ చూడడానికి వచ్చే 100 శాతం అభిమానుల్లో.. 90 శాతం మంది కోహ్లీ కోసమే వస్తారు..ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతలా అభిమానించే తమ అభిమాన క్రికెటర్ అరుదైన మైలురాయిని చేరుకుంటున్న వేళ.. ఆ ప్రత్యేక క్షణాలను తాము కళ్లారా వీక్షించాలని అనుకుంటున్నామని, తమను అడ్డుకోవద్దని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మీద ఒత్తిడి తీసుకుకొచ్చారు. వీరి ప్రయత్నం ఫలించింది. మొహాలీ వేదికగా జరగబోయే కోహ్లీ 100వ టెస్టును 50 శాతం ప్రేక్షకుల మధ్య నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించింది.
కోవిడ్-19 నిబంధనల కారణంగా శ్రీలంక తో జరగనున్న టెస్టును ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఈ మేరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) కూడా ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే.. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం.. అందులోను కోహ్లీ 100 వ టెస్టు మ్యాచ్ కావడంతో.. అభిమానులు తమను అనుమతించాలంటూ బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చారు. కోహ్లిపై బీసీసీఐ కక్షపూరితంగా వ్యవరిస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతనెలలో జరిగిన వెస్టిండీస్, లంకతో టీ20లకు ప్రేక్షకులను అనుమతించి.. మొహాలీ టెస్టు (కోహ్లి వందో టెస్టు) లో మాత్రం ఖాళీ స్టేడియంలో నిర్వహించడమేంటని మండిపడ్డారు.
T20Is ✅
Preps begin for the Tests 👍👍#TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/SR1VkACfCW
— BCCI (@BCCI) March 1, 2022
ఈ విషయమై కోహ్లి అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై వరుస ట్వీట్లతో హోరెత్తించారు. మొహాలీ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐకి బహిరంగ లేఖ రాశారు. #Allowcrowdinmohali హ్యాష్ ట్యాగ్ తో బీసీసీఐకి చుక్కలు చూపించారు. కోహ్లి అభిమానులతో పాటు టీమిండియా మాజీ క్రికెటలు సైతం బీసీసీఐ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్ల కెరీర్ లో వందో టెస్టు అనేది అపురూపమైన మైలురాయి అని.. ఏ క్రికెటరైనా అభిమానుల ముందే తమ టాలెంట్ ను ప్రదర్శించాలని కోరుకుంటారని, కానీ బీసీసీఐ ఇలా చేయడం బావ్యం కాదని వ్యాఖ్యానించాడు.
అభిమానుల ఒత్తిడికి బీసీసీఐ ఎట్టకేలకు తలొచింది. శుక్రవారం(మార్చి 4) నుండి మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా జరగబోయే కోహ్లి 100వ టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి ఆర్ పీ సింగ్లా ధృవీకరించారు. పిసిఎ స్టేడియంలో 25000 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ..ఐదు రోజుల పాటు 50 శాతం అంటే.. 12500 మంది అభిమానులను స్టేడియం లోపలికి అనుమతించనున్నారు. కోహ్లి 2011లో వెస్టిండీస్‌లో భారత జట్టు తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కోహ్లి 99 టెస్టుల్లో 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలతో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి తన 100వ టెస్టులో సెంచరీ చేసి రికార్డు సృష్టిస్తాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
A handwritten letter to BCCI by Virat kohli fan for not allowing crowd in Mohali test Match.#AllowCrowdinMohali https://t.co/Q3YVIlUJ3Y pic.twitter.com/R3SuRJ38Oa
— Johns. (@CricCrazyJ0hns) February 28, 2022
ఇదిలా ఉంటే, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అంగీకరించింది. ఈ విషయాన్ని కేసీఏ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. మార్చి 12 నుంచి 16 వరకు జరగనున్న బెంగళూరు టెస్టు.. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న విషయం తెలిసిందే.