రిషభ్ పంత్ యంగ్ టాలెంటెడ్ అండ్ డైనమిక్ క్రికెటర్. ఇండియన్ క్రికెట్‌లో నయా సంచలనంగా మారిన యువ ఆటగాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వాత టీమిండియాకు రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా మారాడు. దాదాపు ధోని శిష్యుడనే పేరు కూడా తెచ్చుకుంటున్నాడు. శుక్రవారం శ్రీలంకతో మొహాలీ వేదికగా ప్రారంభం అయినా తొలి టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 4పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 96 పరుగులు చేసి లక్మల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయినా కూడా పంత్ బ్యాటింగ్‌కు మొహాలీ స్టేడియం ఫిదా అయిపోయింది.
పంత్ అవుట్ అయి పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో రిషభ్.. రిషభ్ అనే హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగిపోయింది. సెంచరీ చేయకున్నా.. పంత్ ఇన్నింగ్స్‌ను అభినందించింది స్టేడియంలోని క్రౌడ్. కానీ.. సరిగ్గా 3 ఏళ్ల కిందట మార్చ్ 10, 2019న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పంత్‌కు ఇదే గ్రౌండ్‌లో తీవ్ర అవమానం జరిగింది. ఆ మ్యాచ్‌లో పంత్ ఒక స్టెంపింగ్‌ను మిస్ చేశాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకుల ధోని, ధోని.. అని అరవడం ప్రారంభించారు. పంత్ వెస్ట్ ధోని ఉంటే ఆ స్టెంపింగ్‌ను చేసేవాడు. ధోనిని పంత్ ఎప్పటికీ రీప్లేస్ చేయలేడు అని వారి అభిప్రాయం. కానీ ఇప్పుడు అదే మైదానంలో తన పేరు జపించేలా చేశాడు. పోయిన చోటనే వెతుక్కోవాలి అనే సూక్తిని నిజం చేశాడు పంత్. తనను అవమానించిన మైదానంలోనే అభినందనలు పొందాడు. మరి పంత్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Crowd reaction from behind tells you the importance of your knock and how eagerly they were waiting for your century. What a star, what a box office Rishabh Pant is. pic.twitter.com/N91cEGHxGM
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2022
Never seen someone walk any slower. Rishabh Pant took ages to walk back. Out at 96. Really break the hearts. #INDvSL #RishabhPant@RishabhPant17pic.twitter.com/jOlFadeGqg
— Roshan Agrawal (@KaunRoshan) March 4, 2022
— K I N G (@KingKalyanPK) March 5, 2022
— K I N G (@KingKalyanPK) March 5, 2022