ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లీష్ జట్టు అక్కడ పర్యటిస్తోంది. ఇక ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. అయితే అప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆతిథ్య జట్టు సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అయిన డేవిడ్ మలన్, బట్లర్ లు సెంచరీలతో చెలరేగడంతో.. ఇంగ్లాండ్ 346 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మెుయిన్ అలీ. కానీ ఆ షాట్ కాస్తా బెడిసికొట్టడంతో నవ్వుల పాలైయ్యాడు అలీ.
మెుయిన్ అలీ.. సంచలన ఇన్నింగ్స్ లకు మారుపేరుగా క్రికెట్ ప్రపంచంలో సుపరిచితుడే. ఐపీఎల్ లో సునామీ ఇన్నింగ్స్ లకు కేరాఫ్ అడ్రస్ గా మెుయిన్ అలీ నిలిచేవాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. సిరీస్ లో నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 59 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ నవ్వులు పూయించే సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో క్రీజ్ లో అప్పటికే సెంచరీతో ఊపు మీదున్న బట్లర్ తో పాటు మెుయిన్ అలీ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేయడానికి వచ్చాడు తబ్రైజ్ షమ్సీ. ఇక ఈ ఓవర్ లో ఔట్ సైడ్ పడ్డ నాలుగో బంతిని రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు మెుయిన్ అలీ. ఆ షాట్ కాస్తా బ్యాట్ కు కనెక్ట్ కాకపోవడంతో.. బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో ఆశ్చర్యపోయిన సౌతాఫ్రికా కీపర్ నవ్వులు చిందించాడు. దాంతో రివర్స్ స్వీప్ కొడదామనుకున్న మెుయిన్ అలీ కాస్త.. నవ్వుల పాలైయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దాంతో ఈ వీడియోపై సరదాగా స్పందిస్తున్నారు నెటిజన్స్. మెుయిన్ అలీలో ఓ మంచి టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడని, అచ్చం రఫెల్ నాదల్ కొట్టినట్లు బ్యాక్ హ్యాండ్ షాట్స్ ఆడినట్లు ఉందని కామెంట్స్ చేసుకొచ్చారు.
Ok looks like Moeen Ali wanted to show his respect to @Hanumavihari ‘s courage! 1 handed cricket day 🙌🏽#ENGvsSA https://t.co/qCjxJVNKPu pic.twitter.com/YM8vZL5AO0
— Saiyami Kher (@SaiyamiKher) February 2, 2023
ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. జట్టులో డేవిడ్ మలన్(118), జోస్ బట్లర్ (131) సెంచరీలతో చెలరేగడంతో.. ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో క్లాసెన్(80), హెండ్రిక్స్ (52) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా జట్టును దెబ్బతీశాడు జోఫ్రా ఆర్చర్. 9.1 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు నేల కూల్చాడు. మరి మెుయిన్ అలీ కొట్టిన రివర్స్ స్వీప్ షాట్ గురి తప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— MINI BUS 2022 (@minibus2022) February 1, 2023