సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు దుమ్ములేపారు. జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ విధ్వంసకర బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించారు. బెయిర్‌స్టో 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో 90 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సులతో 52 పరుగులు చేశాడు. కాగా మొయిన్ అలీ 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసి ఇంగ్లండ్ తరపున టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
వీరిద్దరికి తోడు మలాన్ కూడా 23 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 43 పరుగులు చేసి రాణించాడు. అయితే సౌతాఫ్రికా బౌలర్ ఆండిలే ఫెహ్లుక్వాయో వేసిన 17వ ఓవర్‌లో బెయిర్‌స్టో, మొయిన్ అలీ విశ్వరూపం చూపించారు. ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులను బెయిర్‌స్టో సిక్సులు కొట్టాడు. దీంతో తడబడిన ఆండిలే రెండు వైడ్లు వేశాడు. మూడో బంతికి బెయిర్‌స్టో సింగిల్ తీయడంతో మొయిన్ అలీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. తర్వాతి మూడు బంతులను కూడా మొయిన్ అలీ సిక్సులు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 33 పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ నిగిడి 5 వికెట్లు పడగొట్టాడు. ఆండిలే ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక భారీ లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికాను ఇంగ్లండ్ బౌలర్లు 193 పరుగులకే కట్టడి చేశాడు. 20 ఓవర్లలో సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్(57), ట్రిస్టన్ స్టబ్స్ 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సులతో 72 పరుగుల తుపాన్ ఇన్నింగ్స్‌తో రాణించారు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో గెలిచింది. రీస్ టాప్లీ 2, గ్లీసన్ 3, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ ఒక వికెట్ తీసుకున్నారు. మరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Moeen Ali grabs the player of the match for his fifty and the big wicket of Reeza Hendricks.#ENGvSA pic.twitter.com/g1lGkH9b9F
— CricTracker (@Cricketracker) July 27, 2022
Absolute carnage from our very own Moeen Ali last night vs SA.. He smacked the fastest t20i fifty by an English batter 🥁😎. streets ain’t ready for Moeen bhai 🥳💥!!#MoeenAli | #Whistlepodu pic.twitter.com/Rwru2DdOMZ
— CSK Loyal FC™ 🏆 (@CSK_Zealots) July 28, 2022
Moeen Ali scores fifty from just 16 balls – The fastest T20I fifty for England. pic.twitter.com/h2JK2zoM7L
— Cricket is Love ❤ (@cricketfan__) July 27, 2022
Tristan Stubbs sparkled in South Africa’s chase, but Bairstow and Moeen Ali put England out of reach – the hosts take the T20I series opener! #ENGvSA
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2022
Madness from England – Moeen Ali and Jonny Bairstow smashes Andil Phehlukwayo for 33 runs in the 17th over. pic.twitter.com/VR9sc6HEH5
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2022
Moeen Ali and Jonny Bairstow smacked 33 runs off Andile Phehlukwayo’s over 🔥#ENGvSA pic.twitter.com/cWht4HhbvI
— CricTracker (@Cricketracker) July 27, 2022