టీమిండియా మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ ఇటీవల అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో ముచ్చటించిన ఆమె.. మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ సూచనప్రాయంగా వెల్లడించింది.
బీసీసీఐ.. 2023లో ఆరు జట్లతో మహిలా ఐపీఎల్ ను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో విదేశీ మహిళా క్రికెటర్లు సైతం ఆడనున్నారు. ఈ టోర్నీలో ఆడాలని మిథాలీ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. తాజాగా ఐసీసీ పోడ్‌కాస్ట్‌లో ముచ్చటించిన ఆమె.. ‘ఐపీఎల్ కోసం ఆ ఆప్షన్‌ను (రీఎంట్రీ) ఎప్పుడూ ఓపెన్‌గా పెట్టుకుంటానని తెలిపింది’. ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా అని ఎదురైన ప్రశ్నకు మిథాలీ ఈవిధంగా స్పందించింది.
పురుషుల ఐపీఎల్ టోర్నీ విజయవంతం కావడంతో మహిళలకు కూడా ఇలాంటి లీగ్ ను ప్రారంభించాలని బీసీసీఐ మీద ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బీసీసీఐ.. వచ్చే ఏడాది దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మహిళా ఐపీఎల్ ను నిర్వహించేందుకు ఫ్రాంచైజీ ఓనర్లు కూడా ఆసక్తిగా ఉన్నారట. మరి మిథాలీ కోరిక తీరుతుందా..? లేదా..? అన్నది కొద్దిరోజుల్లో తేలనుంది. మరి మిథాలీ.. మహిళా ఐపీఎల్ కోసం రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటుందా?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In an entertaining first episode of the 100% Cricket podcast, Mithali Raj reveals what could draw her out of retirement 👀@M_Raj03 | @isaguha | Find out 👇
— ICC (@ICC) July 25, 2022
ఇదీ చదవండి: Axar Patel: ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన అక్షర్ పటేల్! ధావన్ ఏం చేశాడో చూడండి
ఇదీ చదవండి: IND vs WI 2nd ODI Highlights: సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన అక్షర్ పటేల్.. 2nd వన్డే హైలైట్స్!