టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. అందులో ఒక రికార్డును టీమిండియా ఉమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ బద్దలు కొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో మిథాలీ చరిత్ర సృష్టించింది. ఈ ఒక్క మ్యాచ్‌తో అనేక రికార్డులను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్లు అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ రికార్డులను సైతం బద్దలు కొట్టింది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తాను అరంగేంట్రం చేశాక జన్మించిన క్రీడాకారిణితో కలిసి ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
#TeamIndia 🇮🇳 post 2️⃣7️⃣0️⃣/6️⃣ in 50 overs 👍🏻
Captain leading from the front – Mithali Raj scores 66*(81)👌🏻
Richa Ghosh – 65(64)
Sabbhineni Meghana – 49 (50)The New Zealand chase is underway now #NZWvINDW
📸📸 Courtesy: @PhotosportNZ pic.twitter.com/qheEMxfx5M
— BCCI Women (@BCCIWomen) February 15, 2022
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన మిథాలీ రాజ్ కివీస్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా మెన్స్ టీం దిగ్గజ కెప్టెన్లు అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోని రికార్డులను బద్దలుకొట్టింది. రెండో వన్డేలో మిథాలీ చేసిన సాధించిన హాఫ్ సెంచరీ ఆమె కెరీర్‌లో న్యూజిలాండ్‌పై ఏడవది కావడం గమనార్హం. ఈ క్రమంలో అంతకుముందు ఆరేసి హాఫ్ సెంచరీలతో ఉన్న అజారుద్దీన్, ధోనిని మిథాలీ అధిగమించింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 4 హాఫ్ సెంచరీలతో నాల్గో స్థానంలో ఉన్నాడు. రెండో వన్డేలో 66 పరుగులతో అజేయంగా నిలిచిన మిథాలీ రాజ్ కివీస్‌పై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచింది. మరి మిథాలీ బద్దలు కొట్టిన రికార్డ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.