టీమిండియాతో నాలుగు టెస్టుల ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత గడ్డపై అడుగుపెట్టేసింది. ఫిబ్రవరి 9 నుంచి నాగపూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్‌తో మూడు వన్డేల సిరీస్ సైతం ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లు టీమిండియాతో ఎంతో కీలకం. ఎందుకంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా కనీసం 3-1తో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఫైనల్లో ఆస్ట్రేలియాతోనే తలపడాల్సి ఉంది. టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ భారత్‌కు ఎంతో ముఖ్యమే.. ఆస్ట్రేలియాకు కూడా అంతే కీలకం. కాగా.. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయంతో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు దూరం అయ్యాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుకు స్టార్క్ అందుబాటులో ఉండటం లేదు. స్టార్క్ గాయం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బే. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టార్క్ చేతి వేలికి గాయమైంది. అతను ఇంకా ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ విషయాన్ని స్టార్క్ స్వయంగా వెల్లడించాడు. అయితే.. తొలి టెస్టుకు దూరమైనా.. ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టుకు మాత్రం స్టార్క్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
స్టార్క్ మాట్లాడుతూ.. ‘నేను గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోదు. కానీ.. మరో రెండు వారాల్లో ఫుల్‌ఫిట్‌నెస్ సాధిస్తా. భారత్‌తో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కానీ.. ఢిల్లీలో జరిగే రెండో టెస్టుకు మాత్రం అందుబాటులో ఉంటా. అయితే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. భారత్‌కు వచ్చాకా.. నా ప్రాక్టీస్‌ను మొదలుపెడతా’ అని స్టార్క్ పేర్కొన్నాడు. మరి స్టార్క్ లేకుండా ఆస్ట్రేలియా తొలి టెస్టులో బరిలోకి దిగనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mitchell Starc to miss first Test of Border Gavaskar Trophy 🏏
📷: CA#MitchellStarc #INDvsAUS #BorderGavaskarTrophy #CricketTwitter pic.twitter.com/IzCsJoLRaO
— SportsTiger (@StigerOfficial) January 31, 2023