భారత్-ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఓ క్రికెటర్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోయినా బరిలోకి దిగుతున్నాడు. అందుకు కారణం ఏమిటంటే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా జట్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అంతే కాదు ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటారు. ఎలాగో.. ఆస్ట్రేలియాకి ట్రోఫీ గెలిచే అవకాశం లేదు కాబట్టి, ఇప్పుడు వారి ఏకైక లక్ష్యం డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరడం. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పాటు భారత్ కి కూడా ఈ మ్యాచ్ కీలకం కానుంది. భారత తుది జట్టులో పెద్దగా మార్పులేవీ కనిపించకపోవచ్చు. మహా అయితే శుబ్‌మన్ గిల్ జట్టులోకి వస్తే ఒక్క మార్పుతో టీమిండియా మూడో టెస్ట్ బరిలో దిగనుంది. కానీ ఆస్ట్రేలియా ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ మూడో టెస్టుకు అందుబాటులో లేడు. జోస్ హెజెల్‌వుడ్, డేవిడ్ వార్నర్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యారు. ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ పేసర్, గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన మిచెల్ స్టార్క్ కచ్చితంగా మూడో టెస్టులో బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. దీనితో అతడి రాక కంఫర్మ్ అయినట్టే.
పిచ్ ఎలాంటిదైనా ఆస్ట్రేలియాకి పేసర్లే ప్రధాన బలం. నాణ్యమైన పేస్ దళం వారి సొంతం. ఎన్నో సంవత్సరాలుగా ఆస్ట్రేలియా వీరి మీదే ఆధారపడుతుంది. జట్టు విజయాల్లో కూడా పేసర్లే కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా టీం పేస్ బౌలింగ్ ఎటాక్ వీకైందని చెప్పాలి. హెజల్‌వుడ్, స్టార్క్ లేకపోవడంతో కమ్మిన్స్‌ఒక్కడే ఆ బాధ్యతలు మోశాడు. ఇప్పుడు అతను కూడా లేకపోవడంతో ఆ జట్టుకు స్టార్క్ ఒక్కడే దిక్కయ్యాడు. అతనితో పాటు బొలాండ్ ఉన్నా.. అనుభవం లేని బొలాండ్‌ను నమ్ముకునే స్థితిలో ఇప్పుడు ఆస్ట్రేలియా లేదు. దీంతో స్టార్క్ జట్టు ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో మూడో టెస్టు ఆడాల్సి వస్తోంది. అయితే.. అతను పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేడు. అయినా కూడా బరిలోకి దిగుతానని స్టార్క్ స్పష్టం చేశాడు.
గాయం కారణంగా మిచెల్ స్టార్క్ తొలి రెండు టెస్టులకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే స్టార్క్ మూడో టెస్టుకు కూడా 100 శాతం ఫిట్ గా లేడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. స్టార్క్ మాట్లాడుతూ..”కొన్ని రోజులవరకు అసౌకర్యంగా అనిపించినా.. ఇప్పుడు బాగానే ఉన్నాను. నిజానికి 100 శాతం ఫిట్ గా లేను. కానీ మ్యాచ్ ఆడడానికి ఇది సరిపోతుంది. ప్రాక్టీసులో కూడా నా అత్యుత్తమ బౌలింగ్ వేశాను. పూర్తి ఫిట్‌నెస్ తోనే బరిలోకి దిగాలంటే ఇప్పటివరకు నేను కేవలం 5 నుంచి 10 టెస్టులు మాత్రమే ఆడేవాడిని.” అని చెప్పుకొచ్చాడు. దీంతో స్టార్క్ రాకైనా ఆ జట్టుని విజయాల బాట పట్టిస్తుందేమో చుడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Life as a Test Match fast bowler 👀
Mitchell Starc is not at 100% but says he’s ready to play.
More 👉 https://t.co/WJ6n6yPAU3#WTC23 | #INDvAUS pic.twitter.com/LGczAN1LLM
— ICC (@ICC) February 27, 2023