టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ఆస్ట్రేలియా.. భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి 25 మధ్యలో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కానీ.. సిరీస్‌కు కొన్ని రోజుల ముందే ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో టీమిండియా పర్యటనకు దూరమయ్యారు. ఇటివల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్‌తోపాటు మార్కస్ స్టోయినీస్ గాయపడ్డారు. దీంతో టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌కు దూరమవ్వడంతో పాటు స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు కూడా దూరమయ్యే ప్రమాదంలో పడ్డారు.
మిచెల్ స్టార్క్ మొకాలి గాయంతో, మిచెల్ మార్ష్ చీల మండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. స్టోయినిస్ పక్కటెముకల గాయంతో భారత్ పర్యటనకు దూరమయ్యాడు. కాగా.. వీరిస్థానంలో ఆసీస్ మరో ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. నాథన్ ఎల్లీస్, డానియల్ సామ్స్, సీన్ అబాట్‌లను ఎంపిక చేసింది. స్టార్క్, మార్ష్, స్టోయినీస్‌తో పాటు డేవిడ్ వార్నర్ కూడా టీమిండియాతో సిరీస్‌లో పాల్గొనడం లేదు. వార్నర్ టీమిండియాతో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక టీమిండియాతో మూడు టీ20లు ఆడే ఆసీస్ టీమ్ ఈ విధంగా ఉంది.. ఆరోన్ ఫించ్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, జోస్ హజెల్ వుడ్, జోష్ ఇంగ్లీస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్సన్, డానియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టీమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్. మరి టీమిండియాతో సిరీస్‌కు ముందు ముగ్గురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు గాయాలతో దూరమవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చిన్న ట్రిక్‌తో పాకిస్థాన్‌ను ఎర్రిపప్పని చేసిన ధోని! బౌలౌట్‌కు 15 ఏళ్లు!
World Cup squad assembled!
Here’s the 15 who will represent our national men’s team at the upcoming T20 World Cup and tour of India 🇦🇺 pic.twitter.com/DUgqUGWuyV
— Cricket Australia (@CricketAus) August 31, 2022