క్రికెట్‌లో బౌలర్లు అప్పుడప్పుడు పొరపాటున లైన్ అండ్ లెంత్ తప్పి బీమర్లు వేయడం చూస్తుంటాం. సాధారణంగా కొత్త బౌలర్లు నుంచి ఇలాంటి బీమర్లు ఎక్కువగా చూస్తాం. కానీ సీనియర్ బౌలర్ల నుంచి అలాంటి బంతులు అరుదు. కానీ ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచ్చెల్ స్టార్క్ మాత్రం బీమర్‌ను మించిన బంతిని వేశాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బంతిగా నెటిజన్లు ఆ బంతికి పేరుపెట్టేశారు.
ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం కాన్‌బెర్రాలో జరిగిన మూడో టీ20లో ఈ ఘటన జరిగింది. మిచ్చెల్ స్టార్క్ బంతిని బ్యాట్స్‌మెన్‌కు చాలా దూరంగా బంతిని విసిరాడు. అది గాల్లో చాలా పైకి వెళ్లింది. బ్యాట్స్‌మెన్ బంతిని కొడితే వెళ్లినట్లు వెళ్లింది. దీంతో అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటించి, ఫ్రీహిట్ ఇచ్చాడు. పైగా ఆ బంతి బౌండరీకి వెళ్లడంతో శ్రీలంకకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఓవర్ ముగిసిన తర్వాత చూపించే బౌలింగ్ రిప్లే గ్రాఫిక్స్‌లో స్టార్క్ వేసిన బంతి బ్యాట్స్‌మెన్‌కు సంబంధం లేకుండా పైనెక్కడో ఉంది. దీంతో భూమిపై నుంచి విసిరితే.. వేరే గ్రహం పైకి వెళ్లిన బంతి అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి స్టార్క్ వేసిన బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We’ve all bowled them…
‘Use the facilities, Mitch!’ 😂😯 pic.twitter.com/r8SMDnLeJR
— Cricket on BT Sport (@btsportcricket) February 15, 2022