స్డేడియంలో బ్యాట్స్ మెన్ సిక్సర్లు కొడుతుంటే అభిమానులకు ఎక్కడ లేని సంతోషం. ఒకప్పుడు గంగూలీ, సచిన్, వంటి దిగ్గజ ఆటగాళ్లను వరుస బంతులను స్టేడియం బయటకి కొట్టేవారు. ఇక గంగూలీ కొట్టే సిక్స్ లకి స్టేడియంలో ఉన్న బిల్డింగ్ అద్దాలు సైతం పగిలిన రోజులు ఉన్నాయి. తాజాగా.. ఓ క్రికెట్ మ్యాచ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
సూపర్ స్మాష్ లీగ్ లో భాగంగా వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నార్త్రన్ నైట్స్ ప్లేయర్ సాంట్నర్ బ్యాట్ తో చెలరేగాడు. 35 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. కాగా మిచెల్ కొట్టిన ఒక సిక్స్ స్టేడియంలోని ఓ గది అద్దాలను బద్దలుకొట్టింది. ఆ గదికి తాళం వేసి ఉండటంతో లోపలికి వెళ్లిన బంతిని అంపైర్లు బయటకి తీయలేకపోయారు. సాధారణంగా న్యూజిలాండ్ లో క్రికెట్ మైదానాల విస్తీర్ణం చిన్నగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మన్ భారీ సిక్స్ లు కొడితే బంతులన్నీ స్డేడియం బయటే ఉంటాయి. అలానే మిచెల్ కొట్టిన బంతి స్టేడియంలోని అద్దాన్ని పగలకొట్టింది.
ఇది కూడా చదవండి:
అమ్మ ఫోన్ లో ఆడుకుంటూ రూ.1.50 లక్షల షాపింగ్ చేసిన బుడతడు
సూపర్ స్మాష్ లీగ్ లో భాగంగా వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నార్త్రన్ నైట్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ 64, కెప్టెన్ బ్రేస్ వెల్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన నైట్స్ జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. నైట్స్ టీమ్ తరపున మిచెల్ అద్భుత బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ కొట్టిన ఈ సూపర్స్ సిక్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
“The ball is stuck in there, next time they go to open it they will find a white Kookaburra in there” 😂
Mitch Santner finds a window in the Museum Stand.#SparkSport #SuperSmashNZ@cricketwgtninc @SuperSmashNZ pic.twitter.com/9e8j5XMdcB
— Spark Sport (@sparknzsport) January 24, 2022