నేడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు జాఫర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాగ్ కూడా జాఫర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పాడు. కానీ కొంచెం వినూత్నంగా చెప్పాడు. ‘నా తొలి టెస్టు వికెట్‌కు హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వసీం రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్యూ మై పర్మనెంట్ సోషల్ మీడియా వికెట్’ అంటూ పేర్కొన్నాడు.
దీనిపై నెటిజన్లు ఇద్దరు ట్వీట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారని, ఫీల్ అవ్వకుండా మనకు మంచి హాస్యం పంచుతారని కామెంట్లు చేస్తున్నారు. కాగా జాఫర్, వాగ్ ట్వీట్టర్‌లో ఒకరిపై ఒకరు కౌంటర్లు, సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాగ్ .. జాఫర్‌కు డిఫరెంట్‌గా విషెస్ చెప్పాడు. మరి వాగ్ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Happy birthday to my first Test match wicket @WasimJaffer14 !! 👍👍😜😜
— Michael Vaughan (@MichaelVaughan) February 16, 2022
Haha thank you my permanent social media wicket 😜 https://t.co/r1roZKcexb
— Wasim Jaffer (@WasimJaffer14) February 16, 2022