‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ సంబరం కొనసాగుతోంది. అన్ని జట్లు తమ తమ ప్రదర్శనలతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వార్మప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించి మంచి ఉత్సాహంగా ఉంది టీమిండియా. కెప్టెన్‌గా కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్, మెంటర్‌గా ధోనీ.. పొట్టి క్రికెట్‌లో మూడు దిగ్గజాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నదే అందరి ప్రశ్న. మెంటర్‌గా ధోనీ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయడం లేదన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. భారత క్రికెట్ జట్టుకు అతని సేవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ధోనీ నెట్స్‌లో కొత్త అవతారం ఎత్తాడు. ఆ ఫొటోలను బీసీసీఐ పంచుకుంది.
ఇదీ చదివేయండి: అంచనాలను పెంచేస్తున్న రాధే శ్యామ్ టీజర్!
మెంటర్‌గా కోచ్ టీమ్‌కు మధ్య సమన్వయం, వ్యూహకర్తగానే కాకుండా త్రోడౌన్ స్పెషలిస్ట్‌గా కూడా ధోనీ కనిపించాడు. మా త్రోడౌన్ స్పెలిస్ట్ అంటూ ధోనీ బౌలింగ్ చేస్తూ కనిపించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకుంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ ధోనీని పరిచయం చేస్తున్నాం అంటూ ఫొటోలను పంచుకుంది బీసీసీఐ. సూపర్ 12లో టీమిండియాకు పాకిస్తాన్‌తోనే మొదటి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం, ఉత్కంఠ నెలకొన్నాయి. ఆట సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ ప్లేయర్లు, మాజీలు చేస్తున్న కామెంట్లు, వారి మేకపోతు గాంభీర్యం చూసి సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు వేస్తున్న సెటైర్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. భారత్- పాక్ మ్యాచ్‌లో విజయం ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Revealing #TeamIndia’s latest throwdown specialist! @msdhoni | #T20WorldCup 💪🏾🎯 pic.twitter.com/COZZgV7Ba6
— BCCI (@BCCI) October 22, 2021