టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, సురేష్ రైనాలతో పాటుగా మరికొంత మంది మహిళా క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలు ఉన్నారు. అయితే సచిన్ స్థాయిలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు భారత ప్లేయర్స్.
సాధారణంగా ప్రపంచ క్రికెట్ కు అందించిన సేవలకు గాను కొన్ని దేశాలు సదరు ఆటగాళ్లకు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చి సత్కరిస్తుంటాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, సురేష్ రైనాలతో పాటుగా మరికొంత మంది మహిళా క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలు ఉన్నారు. అయితే సచిన్ స్థాయిలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు భారత ప్లేయర్స్. మరి ఇంతకి ఆ అరుదైన గౌవరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్, సురేష్ రైనాలతో పాటుగా టీమిండియా మహిళా క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి లకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వీరికి జీవితకాల సభ్యత్వాన్ని అందించింది. దాంతో సచిన్ స్థాయిలో ఈ అరుదైన గౌరవం పొందారు వీరు. కొన్ని సంవత్సరాల క్రితమే క్రికెట్ గాడ్ సచిన్ కు ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ఇచ్చి సత్కరించింది. ధోని, యువరాజ్, సురేష్ రైనాలు 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులు కావడం విశేషం. ఇక వీరితో పాటుగా ఇతర దేశాల ఆటగాళ్లకు సైతం లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ఇచ్చి సత్కరించించి ఎంసీసీ.
వారిలో ఇంగ్లాండ్ కు చెందిన జెన్నీ గన్, లారా మార్ష్, ఇయాన్ మోర్గాన్, పీటర్సన్, అన్నా శ్రుబ్ సోల్, పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ హఫీజ్, ఆసీస్ కు చెందిన రేచల్ హేల్స్, బంగ్లాదేశ్ కు ఆటగాడు మోర్తజా, రాస్ టేలర్, డేల్ స్టెయిన్ లకు ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ఇచ్చి గౌరవించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎంసీసీ సీఈఓ, సెక్రటరీ గుయ్ లావెండర్ బుధవారం(ఏప్రిల్5)న అధికారికంగా ప్రకటించాడు. మరి సచిన్ స్థాయిలో ధోని, యువరాజ్ కు ఈ గౌరవం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MCC’s new Honorary Life Memberships:
Merissa Aguilleira: West Indies (2008–2019)
M.S. Dhoni: India (2004–2019)
Jhulan Goswami: India (2002-2022)
Jenny Gunn: England (2004-2019)
Muhammad Hafeez: Pakistan (2003-2021)
Rachael Haynes: Australia (2009-2022)— CricTracker (@Cricketracker) April 5, 2023