బంగ్లాదేశ్-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో ఒక షాకింగ్ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లు అప్రమత్తంగా లేకుంటే.. జట్టుకు, వారికి ఎంత నష్టం కలుగుతుందో బంగ్లాదేశ్ ఫీల్డర్ నిరూపించాడు. పైగా బ్యాటర్‌కు దగ్గరగా ఉండి.. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదమే తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్-సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతుంది. సౌత్‌ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ రెండో బంతిని సఫారీ బ్యాటర్ సరేల్ ఎర్వీ కట్ షాట్ ఆడాడు. బాల్ చాలా వేగంగా బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా దూసుకెళ్లింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మెహిదీ హసన్ అప్రమత్తంగా లేకపోవడంతో.. బాల్ నేరుగా వచ్చి అతని కడుపులో తగిలింది.
దీంతో క్యాచ్ మిస్ అవ్వడంతో పాటు అతను గాయపడ్డాడు. బాల్ తగిలిన వేగానికి అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బాల్ తనపక్క నుంచి వెళ్తుంది అనుకున్నాడో ఏమో కానీ.. బాల్ వచ్చి తగిలేంత వరకు స్పందించలేదు. కాగా హసన్ గాయపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. ఇంత అజాగ్రత్తగా ఉన్న ఫీల్డర్‌ను ఇంతవరకు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. గాయపడి గ్రౌండ్ నుంచి చికిత్స నిమిత్తం బయటికి వెళ్లిన హసన్ మళ్లీ గ్రౌండ్‌లోకి రావడంతో బంగ్లా క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి!
Wild scenes pic.twitter.com/vQ2fsBfgEC
— Gareth Jenkinson (@gazza_jenks) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.