ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం వేదికగా విండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌ను కూడా విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆశ్చర్యకరంగా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వచ్చాడు. ఇద్దరూ కలిసి టీమిండియా మంచి స్టార్ట్ ఇచ్చారు.
తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 రన్స్ చేసి అకేల్ హోసేన్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పంత్(14), హార్దిక్ పాండ్యా(1), జడేజా(16) కూడా పెద్దగా రాణించలేదు. అప్పటి వరకు రోహిత్ శర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ.. 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చివర్లో దినేష్ కార్తీక్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 రన్స్ చేసి టీమిండియా మంచి స్కోర్ అందించాడు. అతని అశ్విన్ (13 నాటౌట్) అండగా నిలిచాడు. కానీ.. 16 ఓవర్లు ముగిసే సరికి 138 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియాను మరింత ఒత్తిడిలోకి నెట్టే బంగారం లాంటి అవకాశాన్ని విండీస్ ఆటగాడు నేలపాలు చేశాడు. చేతిలో బాల్ ఉంచుకుని అశ్విన్‌ను రనౌట్ చేయుకుండా అందరికి షాకిచ్చాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన మెక్కాయ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో చోటు చేసుకుంది.
18వ ఓవర్‌ను మూడో బంతని దినేష్ కార్తీక్ స్ట్రేట్‌డ్రైవ్ ఆడాడు. తొలి పరుగును వేగంగా పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించారు. ఫీల్డర్ బాల్‌ను నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అక్కడే ఉన్న బౌలర్ మెక్కాయ్ బంతిని అందుకున్నాడు. అప్పటికీ అశ్విన్ క్రీజ్‌కు చాలా దూరంలో ఉన్నాడు. అయినా కూడా మెక్కాయ్ వికెట్లను టచ్ చేయలేదు. దీంతో అశ్విన్ క్రీజ్‌లోకి చేరుకున్నాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సింపుల్ రనౌట్‌ను మెక్కాయ్ ఎందుకు చేయలేదని విండీస్ క్రికెటర్లు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఈ సంఘట చూసిన క్రికెట్ అభిమానులు.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వేదికగా లేవనెత్తారు. కానీ.. ఫీల్డర్ వైపు చూస్తూ బాల్ అందుకున్న మెక్కాయ్ అశ్విన్ ఎక్కడున్నాడో గమనించలేకపోయాడు. అప్పటికే అతను క్రీజ్‌లోకి చేరుకుని ఉంటాడని రనౌట్ చేయలేదని తర్వాత వెల్లడించాడు.
అశ్విన్ ఎంత దూరంలో ఉన్న విషయం గమనించలేకపోయిన మెక్కాయ్ సింపుల్ రనౌట్‌ను నేలపాలు చేశాడు. అశ్విన్‌ను రనౌట్ చేసి ఉంటే టీమిండియా 7వ వికెట్ కోల్పోయి మరింత ఒత్తిడిలోకి వెళ్లి ఉండేది. కానీ మెక్కాయ్ ఇచ్చిన లైఫ్‌ను ఉపయోగించుకున్న టీమిండియా డీకే తుఫాన్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను టీమిండియా బౌలర్లు కేవలం 122 పరుగులకే కట్టడి చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసిన విండీస్ 68 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కానీ.. మెక్కాయ్ ఏమరపాటు మాత్రం విండీస్‌ను దారుణంగా దెబ్బతీసింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What just happened?
Watch the India tour of West Indies, only on #FanCode👉https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket#WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/p1afqoBKiy
— FanCode (@FanCode) July 29, 2022