ప్రస్తుతం జరుగుతున్న దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో యంగ్ ప్లేయర్స్ దుమ్మురేపుతున్నారు. వరుసగా సెంచరీలు సాధిస్తూ.. టీమిండియా సెలెక్షన్ కమిటీకి కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఓ వైపు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో చెలరేగుతుంటే.. మరో వైపు తానేమీ తక్కవ కాదన్నట్లుగా హ్యాట్రిక్ శతకాలు బాదాడు త్రీడి ప్లేయర్ విజయ్ శంకర్. ఇక తాజాగా జరుగుతున్న కేరళ వర్సెస్ కర్ణాటక మ్యాచ్ లో ద్విశతకంతో చెలరేగాడు మయాంక్ అగర్వాల్. మయాంక్ డబుల్ సెంచరీ సాధించడంతో కర్ణాటక మూడో రోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. దాంతో కర్ణాటక జట్టుకు 68 పరుగుల ఆధిక్యం లభించింది.
రంజీ ట్రోఫీలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్ లో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్. 360 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 208 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా గానీ ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. క్రీజులో పాతుకుపోయి స్కోరును పరుగులు పెట్టించాడు మయాంక్. అతడికి నికిన్ జోస్ 54 పరుగులతో అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వి. చంద్రన్ బౌలింగ్ లో 208 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ అయ్యాడు మయాంక్. అప్పటికి కర్ణాటక జట్టు స్కోరు 336 పరుగులు. అయితే ఇందులో 208 పరుగులు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వి కావడం విశేషం.
ఈ క్రమంలోనే మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు 6 వికెట్లకు 410 పరుగులు చేసింది. దాంతో 68 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం క్రీజ్ లో బిఆర్ శరత్(47), శుభమ్ హెగ్డే(8) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మయాంక్ డబుల్ సెంచరీ బాదడంతో.. సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ ఫుల్ ఖుషీగా ఉంది. మార్చిలో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో.. మయాంక్ ఫామ్ లోకి రావడం జట్టుకు శుభ సూచకంగా క్రీడానిపుణులు భావిస్తున్నారు. మరి మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mayank Agarwal smashed a double century in Ranji Trophy 🤩#CricketTwitter pic.twitter.com/4dTKEknJtY
— Sportskeeda (@Sportskeeda) January 19, 2023