స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు బుధవారం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో స్టార్ ప్లేయర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీకి పాజిటివ్‌గా తేలింది. దీంతో సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టు సభ్యుడు మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మయాంక్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. కాగా మయాంక్ అగర్వాల్ భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ సభ్యుడిగా ఉన్నాడు.
ఇప్పటివరకు 5 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మయాంక్ అగర్వాల్ 17 సగటుతో 86 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 32 పరుగులు. కాగా టీమిండియా ఆటగాళ్లకు కరోనా సోకడం ఒక విధంగా మయాంక్‌కు కలిసొచ్చిందని చెప్పాలి. ఇప్పటికే జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో.. మయాంక్‌కు అనుకోని విధంగా అవకాశం లభించింది. ఈ వన్డే సిరీస్‌లో మయాంక్ రాణిస్తే.. వన్డే జట్టులో కూడా తన స్థానం సుస్థిరం చేసుకోవచ్చు. మరి మయాంక్‌కు వన్డే జట్టులో చోటు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చెంప దెబ్బ తిన్న టీమిండియా క్రికెటర్! వీడియో వైరల్!