ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్నాడు మయాంక్ అగర్వాల్. ప్రత్యర్థి జట్టు 205 పరుగుల భారీ స్కోర్ చేసినా ఛేదించి సూపర్ విక్టరీని పంజాబ్ కింగ్స్ నమోదు చేసింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఐపీఎల్ 2022 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్ గెలుపుతో మయాంక్ అగర్వాల్‌కు పెద్దగా పేరు రాలేదు కానీ.. కెప్టెన్‌గా అతను చేసిన ఒక పని మాత్రం.. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని అనిపించేలా చేసింది. భారీ లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్‌కు కెప్టెన్ మయాంక్, ఓపెనర్ శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పవర్‌ప్లేలో పరుగుల వరదపారించారు.
పంజాబ్ కింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో 71 పరుగుల వద్ద మయాంక్, 118 పరుగుల వద్ద శిఖర్ ధావన్ అవుట్ అయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చి దూకుడుగా ఆడుతున్న రాజపక్సను సిరాజ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి అవుట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన యువ క్రికెటర్ రాజ్ బవాను తర్వాతి బంతికే సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బవా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఎన్నో ఆశలతో తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాలనుకున్న బవా ఇలా డకౌట్‌గా వెనుదిరగడంతో తీవ్ర నిరాశ చెందాడు. అతను పంజాబ్ డగౌట్‌కు చేరుకోగానే కెప్టెన్ మయాంక్ లేచివచ్చి.. బవాను ఇన్స్‌ఓకే అన్నట్లు భుజం తట్టాడు. బవా నిరాశగానే డ్రెస్సింగ్ రూమ్‌కు చేరాడు.తొలి మ్యాచ్‌లోనే ఒక యువ క్రికెటర్ ఇలా దారుణంగా విఫలం అయితే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసిన మయాంక్ అగర్వాల్ అతని వెన్ను తట్టడం క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంది. రాణించిన ఆటగాడిని అందరూ మెచ్చుకుంటారు.. కానీ విఫలం అయినా ఆటగాడికి ధైర్యం చెప్పడం గొప్ప విషయం అంటూ మయాంక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా జట్టు కెప్టెన్ అయిన మయాంక్ ఇలా యువ క్రికెటర్‌కు మద్ధతుగా నిలబడ్డ మంచి విషయం అని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన గొప్ప లక్షణం మయాంక్‌లో కనిపించదని అంటున్నారు. ఇలా మయాంక్ చేసిన ఒక చిన్న పని రాజ్ బవాపై ఎంతో ప్రభావం చూపి, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మరీ ఈ విషయంలో మయాంక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సస్పెన్స్ సినిమాని తలపించేలా మయాంక్ అగర్వాల్ రనౌట్!
Lovely gesture from Mayank Agarwal. #IPL2022 pic.twitter.com/NlylQdjvXj
— Vedant Sharma (@VedantSharma_) March 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.