ఐపీఎల్ 2022 హడావుడి అప్పుడే మొదలైపోయింది. కొత్తగా రెండు జట్లు చేరుతుండడం, మెగా వేలం జరగనుండడంతో.. ఏ జట్టులో ఏ ఆటగాళ్లు ఉంటారో, ఆర్సీబీ లాంటి జట్టుకు కెప్టెన్‌గా ఎవరు ఉండనున్నారో అనే చర్చ క్రికెట్ అభిమానుల్లో జోరుగా నడుస్తోంది. కాగా ఇప్పుటికే అన్ని జట్ల యాజమాన్యాలు ఏఏ ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
2021 ఐపీఎల్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలోపడింది. మెగా ఆక‌్షన్‌లో ఆటగాళ్లను కొన్న తర్వాత తమ కెప్టెన్‌ను నియమించాలని ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ భావించినప్పటికీ.. విరాట్‌తో పాటు రిటైన్ అవుతున్న ప్లేయర్ మ్యాక్స్‌వెల్‌కు జట్టు పగ్గాలు అందించాలని మేనేజ్‌మెంట్ డిసైడ్ అయినట్లు సమాచారం. 2021 ఐపీఎల్‌లో మ్యాక్సీ అద్భుత ఫామ్‌ను కనబర్చాడు. కోహ్లీ తర్వాత జట్టును విజయపథంలో మ్యాక్సీ నడిపించగలడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే కోహ్లీకి, మ్యాక్స్‌వెల్ మధ్య మంచి స్నేహా వాతావరణం ఉంది. ఇది కూడా ఒక రకంగా జట్టుకు కలిసివస్తుందని టీమ్ మేనేజ్‌మెంట్ అంచనా. అదే నిజమైతే.. 2022 ఐపీఎల్‌లో ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌ను చూడొచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడని ఆర్సీబీ జట్టు.. కనీసం ఈ సారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మ్యాక్స్‌వెల్ ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.