క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. ఆటలో గెలుపు, ఓటములు సహజం. కానీ.., ఒక్క విజయానికి కాస్త గర్వంతో కాలర్ ఎగరేస్తే ఏదో ఒకరోజు చితకలపడక తప్పదు. పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రీది విషయంలో ఇప్పుడు ఇదే మ్యాటర్ నిజం అయ్యింది. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా గత నెల 24న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి వరుసగా షాహీన్ అఫ్రిది బౌలింగ్ లోనే ఔటయ్యారు. ఆ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అఫ్రీదిని ఇండియన్ ఫ్యాన్స్ కూడా మెచ్చుకున్నారు. కానీ.., షాహీన్ అఫ్రీదీ మాత్రం ఆ గౌరవాన్ని ఎక్కువ రోజులు నిలువుకోలేదు.
ఈనెల 7న స్కాట్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా అఫ్రీది తన బుద్దిని బయట పెట్టుకున్నాడు. తన బౌలింగ్ లో విరాట్, రోహిత్, రాహుల్ ఔటైన విధానాన్ని ట్రోల్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా అక్కడున్న పలువురు అభిమానులు అతడిని చూస్తూ.. ముగ్గురు భారత బ్యాటర్ల పేర్లను పిలుస్తుండగా అఫ్రిది వారిని అనుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. షాహీన్ చేసిన పని ఇండియన్ క్రికెట్ అభిమానులను బాధకి గురి చేసింది. కానీ.., టీమిండియా ఫ్యాన్స్ కి ఇప్పుడు ఆ బాధకి బదులు తీర్చుకునే అవకాశం రావడంతో వారు ట్వీట్స్ తో రెచ్చిపోతున్నారు
Well deserved.. #byebyePakistan#Pakistan #Karachi
Glad that you returned back to earth😁https://t.co/RECTFJnHmf— Vinod (@Vinoth_Balaram) November 11, 2021
టీ 20 వరల్డ్ కప్ లో సెమీస్ లో భాగంగా ఆస్ట్రేలియా- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమికి షాహీన్ అఫ్రీది చెత్త బౌలింగ్ కూడా ఓ ప్రధాన కారణం. ముఖ్యంగా.. కీలకైమన 19 ఓవర్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టించుకుని షాహీన్ పాక్ ఓటమికి కారణం అయ్యాడు. మాథ్యూ వేడ్ బ్యాటింగ్ కి తన దగ్గర సమాధానం లేక.. చూస్తూ ఉండిపోయాడు షాహీన్ అఫ్రీది. దీంతో.. పాక్ ఓటమికి కారణం అయిన అఫ్రీదిని ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి.. షాహీన్ అఫ్రీదికి.. వేడ్ తగిన శాస్తి చేశాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Reminding….🤣 pic.twitter.com/AeMiPX4XJz
— Manish Sharma🇮🇳 (@MONU656) November 11, 2021