పాకిస్థాన్ టీ20 లీగ్ లో భాగంగా శనివారం నాడు కరాచీ కింగ్స్-క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ లీగ్ లో చాలా మంది ప్లేయర్స్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. బ్యాటర్లు తమ బ్యాట్ కు పని చెబుతుంటే.. బౌలర్లు బాల్ తో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాడు కరాచీ కింగ్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ సెంచరీతో చెలరేగిపోయాడు. క్వెటా గ్లాడియేటర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కివీస్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్. ఓ వైపు వికెట్లు పడుతున్నా గానీ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు ఈ ఓపెనర్. ఇక అండ్రూ టై వేసిన 19వ ఓవర్లో తన విశ్వరూపాన్నే చూపాడు.
పాకిస్థాన్ టీ20 లీగ్ లో భాగంగా శనివారం నాడు కరాచీ కింగ్స్-క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అయితే గ్లాడియేటర్స్ జట్టు ఈ స్కోరు చేసింది అంటే అది గుప్టిల్ పుణ్యమనే చెప్పాలి. ఎందుకంటే.. తొలి ఓవర్ లోనే 2 రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టు కంటిన్యూస్ గా వికెట్లను కోల్పోతూనే ఉంది.
అయినప్పటికీ తన విధ్వంసాన్ని కొనసాగించాడు గుప్టిల్. కారాచీ బౌలర్లపై సిక్స్ లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 67 బంతులు ఎదుర్కొన్న గుప్టిల్ 12 ఫోర్లు, 5 సిక్స్ లతో 117 పరుగులు చేశాడు. ఇతడికి అండగా.. ఇఫ్తీకర్ అహ్మద్ 32 పరుగులతో రాణించాడు. గుప్టిల్ ఊచకోతకు బలైంది మాత్రం ఆస్ట్రేలియా బౌలర్ అండ్రూ టై అనే చెప్పాలి. టై వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఏకంగ 30 రన్స్ పిండుకున్నాడు గుప్టిల్. ఈ ఓవర్ లో వరుసగా.. 4,6,4,6,6,4 బాదాడు. దాంతో ఓ మోస్తారు స్కోరు పోతుంది అనుకున్న తరుణంలో 168 పరుగులకు చేరుకుంది. ప్రస్తుతం కరాచీ టీమ్ 4 ఓవర్లలో35 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యం దిశగా సాగుతోంది.
Some fine work from the @KarachiKingsARY bowlers put a halt to the runs until Martin Guptill walked in for the Gladiators. Now @TeamQuetta have a good score on the board and an innings full of possibilities. #SabSitarayHumaray l #KKvQG | #HBLPSL8 pic.twitter.com/UOPqozrD6J
— PakistanSuperLeague (@thePSLt20) February 18, 2023