గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.. క్రికెట్ ప్రపంచాన్ని వదలడం లేదు. ఇప్పటికే.. కరోనా కారణంగా కొన్ని సిరీస్‌లు వాయిదా పడగా, మరికొన్ని టోర్నీలు ఏకంగా రద్దు అయ్యాయి. ఈ క్రమంలో కరోనా భూతం నుంచి రక్షించేందుకు బయో బబుల్ సెక్యూర్ జోన్‌ని ఏర్పాటు చేసి, ఆటగాళ్ల కదలికపై అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చింది బీసీసీఐ. అయితే.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బయో బబుల్ నిర్ణయాన్ని సడలించింది. ఈ నిర్ణయంతో ఆటగాళ్లు సైతం హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఐపీఎల్ లో అదరగొట్టిన సఫారీ ప్లేయర్ అయిడిన్ మార్క్‌రమ్, తొలి టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలాడు.
మార్క్‌రమ్ కు పాజిటివ్ గా తేలడంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. టాస్ వేసే సమయంలో ప్రొటిస్ జట్టు కెప్టెన్ టెంబా బావుమా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. మర్కరమ్ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. మిగిలిన ప్లేయర్లకు నెగిటివ్ రిజల్ట్ రావడంతో మ్యాచ్‌ను సజావుగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ -2022)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్‌లో మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచ్‌లు ఆడి.. 381 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి.
Aiden Markram is in isolation after he tested Covid positive.#RishabhPant #KLRahul #HardikPandya #IndianCricket #INDvsSA #Cricket #Betbarter #TembaBavuma #AidenMarkram pic.twitter.com/OU8CeXARAP
— Bet Barter (@BetBarteronline) June 9, 2022
ఇదిలా ఉండగా.. సీనియర్లకు విశ్రాంతి, గాయాల కారణంగా యువజట్టుతో భారత్ బరిలోకి దిగుతున్నది. టీ20 సిరిస్‌కు కెప్టెన్‌గా రిషబ్ పంత్, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించింది.
భారత్ జట్టు : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్) హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్.
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిచ్ నోర్జే.
Aiden Markram misses out 1st T20I against India after testing positive for COVID-19 🏏. Tristan Stubbs making his debut for SA.#savsind #indvssa #t20 #t20cricket #cricket #india #southafrica #bcci #csa pic.twitter.com/AbRX3dkaQF
— Sports_Divine (@SportsDivine3) June 9, 2022