అవును విన్నది చూసింది నిజమే. ఏకంగా ఓ క్రికెటర్ గ్రౌండ్ లో బట్టలిప్పేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.
క్రికెటర్లు చేసే పనులు అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాయి. గ్రౌండ్ లో కావొచ్చు, బయట కావొచ్చు కొన్నిసార్లు వాళ్లు వింతగా ప్రవర్తిస్తుంటారు. అది చూసి అవాక్కవడం తప్పించి మనం ఏం చేయలేం. అయితే యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ లో చూపించినట్లు ఇదేం అబద్ధం కాదు. స్టార్ క్రికెటర్ నిజంగానే గ్రౌండ్ లోనే తన బట్టలు తానే విప్పేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఏంటనేది ఇప్పుడు స్టోరీలో చెప్పుకుందాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ తరఫున బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న మార్క్ వుడ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ తో సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతేడాది డిసెంబరులో పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ లో కనిపించిన ఇతడు.. ఇప్పుడు బంగ్లాతో వన్డే, టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఉన్నాడు. మార్చి 1 నుంచి ఈ సిరీసులు ప్రారంభం కానున్నాయి. ఇందులో గెలవాలని ఎవరికి వారు బాగానే ప్రాక్టీసు చేస్తూ కనిపించారు. వుడ్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ట్రై చేశాడు. హాఫ్-నేక్డ్ ఛాలెంజ్ లో భాగంగా గ్రౌండ్ లో క్యాచ్ పట్టాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బాగా ఎత్తులో ఉన్న బంతి తన చేతుల్లో పడేలోపు తాను ధరించిన బట్టలన్నీ విప్పేశాడు. కేవలం షార్ట్ మాత్రమే ఉంచి క్యాచ్ పట్టాడు.
మరో షార్ట్ విప్పే క్రమంలో అది కాళ్ల దగ్గర ఇరుక్కుపోయింది గానీ క్యాచ్ పట్టడంలో మాత్రం మార్క్ వుడ్ సక్సెస్ అయ్యాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ తరహా ఛాలెంజులు ఎక్కడా చూడలేదని నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ‘ఇంకా నయం ఒంటిపై ఉన్న ఆ షార్ట్ విప్పేయకుండా బతికించాడు’ అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తరఫున 57 వన్డేలు ఆడిన వుడ్.. 69 వికెట్లు తీశాడు. 27 టీ20ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. 28 టెస్టుల్లో 90 వికెట్స్ తీశాడు. మరి క్యాచ్ కోసం ఈ క్రికెటర్ బట్టలిప్పేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
England would’ve won if they’d put Mark Wood in the lineup, look at these skills pic.twitter.com/dlxjd5Ejp7
— Michel Delving (@michel_delving) February 28, 2023