న్యూజీలాండ్ బ్యాటర్ మార్క్ చాప్ మన్ పాకిస్థాన్ పై చెలరేగి ఆడి సెంచరీ చేసాడు. క్రికెట్ లేని చైనా దేశం నుండి వచ్చి అంతర్జాతీయ మ్యాచుల్లో చెలరేగిపోతున్నాడు. అసలు అసలు ఎవరీ చాప్ మన్ ?
కళ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సాధించాలన్న తపన, ఆసక్తి ఉంటే చాలు విజయమే నీ దగ్గరకి వస్తుంది. ఈ సూక్తిని అక్షరాలా నిజం చేసి చూపించాడు ఒక క్రికెటర్. క్రికెట్ లేని చైనా దేశం నుండి వచ్చి అంతర్జాతీయ మ్యాచుల్లో చెలరేగిపోతున్నాడు. పుట్టింది చైనాలోనైనా ఆ తర్వాత హాంగ్ కాంగ్ కి వలస వెళ్ళిపోయాడు. ఇక 2018 లో ఆక్లాండ్ కి వెళ్లిపోయిన ఈ ఆటగాడు ప్రస్తుతం న్యూజీలాండ్ తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. జట్టులో స్థానం దక్కించుకోవడం ఒక ఎత్తయితే.. టీమ్ లో ఆటగాడిగా రానిస్తుండడం అద్భుతమని చెప్పాలి. ఇంతలా ఆదర్శంగా మారిన క్రికెటర్ ఎవరో కాదు. ప్రస్తుత న్యూజిలాండ్ T20 మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్క్ చాప్ మన్.
28 ఏళ్ళ చాప్ మన్ 2014 లోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నేపాల్ మీద 2014 లో తొలి టీ 20 ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. 2015 లో యూఏఈ మీద తొలి వన్డే ఆడాడు. 2018 లో ఆక్లాండ్ కి వచ్చేసిన చాప్ మన్ న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. వన్డే, టీ 20ల్లో సెంచరీ బాదేశాడు. ప్రస్తుతం న్యూజీలాండ్ జట్టు పాకిస్థాన్ తో 5 టీ 20 ల సిరీస్ లో భాగంగా పాక్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చివరిదైన 5 వ టీ 20 లో కివీస్ జట్టు ఘన విజయం సాధించింది. అసలు విషయానికి వస్తే చాప్ మన్ ఈ మ్యాచుల్లో సెంచరీతో చెలరేగడం విశేషం.
భారీ స్కోర్ ఎదురుగా ఉన్నా.. పాకిస్థాన్ లో ఆడుతున్నా ఏ మాత్రం బెదరలేదు. ప్రతి బౌలర్ ని టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టించాడు. 57 బంతుల్లో 104 పరుగులు చేసి 1-2 తో వెనకబడి ఉన్న తమ జట్టుకి విజయాన్ని అందించి సిరీస్ సమం అయ్యేలా చేసాడు. చాప్ మన్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి. చాప్ మన్ కి తోడు నీషం(45) కూడా రాణించాడు. కేవలం ఈ ఒక్క మ్యాచులోనే కాదు ఈ సిరీస్ అంతటా నిలకడగా ఆడి 290 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు చాప్ మన్. చైనాలో పుట్టి.. హాంగ్ కాంగ్ తరపున అరంగ్రేటం చేసి ఇప్పుడు న్యూజీలాండ్ టీమ్ తరపున రాణించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
The moment Mark Chapman scored his maiden T20I century 😍 🏏 #PAKvNZ #CricketNation pic.twitter.com/3NHL0XYi0u
— Sky Sport NZ (@skysportnz) April 24, 2023