క్రికెట్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న లెజెండ్స్ అంతా మళ్లీ బ్యాట్ పట్టుకుని తమ సత్తా చాటుతున్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ అనే పేరిట ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఒక ఎడిషన్ కూడా పూర్తి చేసుకున్నారు. సెప్టెంబర్ 16 నుంచి మరో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం నాలుగు ఫ్రాంచైజీలు ఉన్నాయి. అదానీ గ్రూప్ సొంతమైన గుజరాత్ జెయింట్స్, జీఎంఆర్ స్పోర్ట్స్ వారి ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ గ్రూప్ వారి మణిపాల్ టైగర్స్, బిల్వారా గ్రూప్‌కు చెందిన బిల్వారా కింగ్స్ అనే నాలుగు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ నాలుగు ఫ్రాంచైజీలు మొత్తం రూ.32 కోట్లతో 59 మంది ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.
ప్లేయర్ల డ్రాఫ్ట్ లో మొత్తం 79 మంది ఆటగాళ్లు ఉంటారు. వారిని కొనుగోలు చేసేందుకు ఒక్కే జట్టుకు రూ.8 కోట్ల పర్స్ ఉంటుంది. ఆ డబ్బు నుంచి వారు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంకో మూడ్రోజుల్లో ఫైనల్ స్క్వాడ్ లిస్ట్ ను ఫ్రాంచైజీలు అప్పగిస్తే.. వారి పర్స్ నుంచి మరికొంత మంది అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయచ్చు. ఇప్పటికే గుజరాత్ జెయింట్స్ జట్టుకు సెహ్వాగ్ కెప్టెన్ అని ప్రకటించారు. అలాగే ఇండియా క్యాపిటల్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మిగిలిన రెండు ఫ్రాంచైజీలు కూడా తమ తమ కెప్టెన్లను ప్రకటించాయి.
Squads of India Capitals, Gujarat Giants, Bhilwara Kings and Manipal Tigers in the Legends league cricket. pic.twitter.com/l27VvnSNoP
— CricketMAN2 (@ImTanujSingh) September 3, 2022
మణిపాల్ టైగర్స్ జట్టుకు.. టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ కెప్టెన్ వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు బిల్వారా గ్రూప్ కు చెందిన బిల్వారా కింగ్స్ జట్టుకు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ను కెప్టెన్ ఎంపిక చేశారు. తమను కెప్టెన్లుగా ఎంపిక చేయడం పల్ల హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వారివారి యాజమాన్యాలకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి, అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 16 నుంచి ఈ లెజెండ్స్ లీగ్ ఎడిషన్ 2 ప్రారంభంకానుంది.
Manipal Tigers Squad for Legends League Cricket:#LLC #cricketnews pic.twitter.com/6tzdZ65ZYL
— CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) September 3, 2022
దేశవ్యాప్తంగా మొత్తం 5 వేదికల్లో ఈ లెంజెండ్స్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, కటక్, జోధ్‌పూర్ వేదికల్లో సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 08 వరకు అంటే.. 22 రోజులపాటు ఈ లీగ్ సాగనుంది. లీగ్ లో మొత్తం 4 జట్లు 16 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇనాగురేషన్ మ్యాచ్ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య నిర్వహించనున్నారు. ఇండియా మహారాజాస్ దాదా కెప్టన్‌గా ఉండగా.. వరల్డ్ జెయింట్స్ కు ఇయాన్ మోర్గాన్ సారధ్యం వహిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్ మొత్తంలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు. లెజెండ్స్ లీగ్‌కు హర్భజన్, ఇర్ఫాన్ కెప్టెన్లు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Squad for Legends League Cricket🤩#ManipalTigers #LLCT20 #BossGame #LegendsLeagueCricket #BossLogoKaGame #GujaratGiants #IndiaCapitals #BhilwaraKings #Cricket pic.twitter.com/Ickvv4EguC
— SportsTiger (@sportstigerapp) September 3, 2022