గుండెపోటు.. ఈ మధ్య కాలంలో అందరిని హడలెత్తిస్తున్న మాట ఇది. అన్ని రంగాలలోని చాలా మంది ప్రముఖులు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇందుకు క్రీడా రంగం ఏమి అతీతం కాదు. ముఖ్యంగా క్రికెట్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ వంటి స్టార్ ప్లేయర్స్ గుండెపోటుకి గురై చికిత్స తీసుకున్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కూడా గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుండి తేరుకోకముందే ఇండియన్ క్రికెట్ లో కూడా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ క్రికెట్ బోర్డుకి చెందిన ఓ 25 ఏళ్ల యంగ్ క్రికెటర్ కు తాజాగా గుండెపోటు వచ్చింది. ఈ యువ క్రికెటర్ చికిత్స కోసం క్లినిక్‌కి వెళ్లాడు. అక్కడ కూర్చొని ఉండగా.. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో.. ఆ ప్లేయర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఒకవైపు డాక్టర్స్ వైద్యం అందిస్తున్నా.., ఆ సమయంలో అతని గుండె 40 సార్లు ఆగిపోయింది. కానీ.., వైద్యులు మాత్రం అంతసేపు శ్రమించి, అతని ప్రాణాలు కాపాడారు.
“రాత్రి 11 గంటలకు భరించలేని నొప్పి రావడంతో నేను హాస్పిటల్ కు వెళ్ళాను. కానీ.., నా పరిస్థితి చూసిన వైద్యులు ఐసీయూ చేరాలి అని చెప్పారు. అంతలోనే నాకు స్ట్రోక్ వచ్చి పడిపోయాను. ఆ తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదు. నన్ను బతికించిన డాక్టర్స్ కు కృతజ్ఞతలు” అంటూ.. ఆ క్రికెటర్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. ఇక మెరుగైన వైద్యం కోసం క్రికెటర్ ను కుటుంబసభ్యులు నాగ్‌పూర్‌కు తీసుకెళ్లారు. మరి.. ఇంత చిన్న వయసులో కూడా గుండెపోటు రావడానికి కారణం ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మరణాలు ఎక్కువ కావడానికి కారణం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.