టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను గట్టిగా హెచ్చరించారు. ‘మీ పని మీరు చూస్కోండి. ఇండియన్ క్రికెట్ విషయంలో తలదూర్చాల్సి అవసరం లేదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ కారణంగా అంతర్జాతీయ షెడ్యూల్‌కు, అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు ఇతర లీగ్‌లలో పెట్టుబడులు పెట్టడంపై ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం క్రికెట్‌కు పెను ప్రమాదం అని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో టీమ్ ఉన్న ఫ్రాంచైజ్‌లు కొత్తగా ప్రారంభం కానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, యూఏఈ టీ20 లీగ్‌లలో సైతం ఫ్రాంచైజ్‌లు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన, ధనిక లీగ్ అయిన ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టిన యాజమానులే ఈ లీగ్‌లలో కూడా పెట్టుబడులు పెట్టడంతో అవి కూడా ఐపీఎల్ అంత పెద్ద హిట్ అవుతాయని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు భయపడుతున్నాయి.
పైగా ఈ రెండు కొత్త లీగ్‌లు.. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ టీ20 లీగ్‌లు జరిగే టైమ్‌లోనే జరుగుతుండటం కూడా ఈ రెండు క్రికెట్ బోర్డులకు మింగుడుపడటం లేదు. ఈ అక్కసుతోనే ఐపీఎల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ గురించి, ఇండియన్ క్రికెట్‌లో జరిగిన మార్పుల గురించి మాట్లాడుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను సునీల్ గవాస్కర్ పై విధంగా హెచ్చరించారు. తమ దేశాల్లో క్రికెట్ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని.. భారత్‌లో క్రికెట్ ప్రాసెస్‌పై అనవసరంగా తలదూర్చొద్దని స్పష్టం చేశాడు.
అలాగే ది హండ్రెడ్ లీగ్ జరిగే సమయంలో ఇంగ్లండ్ జట్టు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐసీసీ షెడ్యూల్‌లో ప్లాన్ చేసుకుంటుంది. అలాగే బిగ్‌బాష్ సమయంలో ఆసీస్ కూడా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడదు. కానీ.. అవి రెండు జరిగే టైమ్‌లో రెండు కొత్త లీగ్‌లు వస్తుంటే మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఆసీస్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. ఇదేక్కడి న్యాయం అంటూ గవాస్కర్ మండిపడ్డారు. కాగా సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ లిటిల్ మాస్టర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sunil Gavaskar sir, awesome 💪😎
Big daddies are puzzled coz their own players can’t avoid IPL ✅😂#sunilgavaskar #IndvsWI #WIvIND #WIvsIND #RohitSharma𓃵 #DineshKarthik https://t.co/Rk5HgksrEf— DaebakAnkita💃 (@DaebakankitaF) August 6, 2022
ఇది కూడా చదవండి: వాళ్లు ఆడితే.. IPLకు వచ్చే నష్టమేమి లేదు: గిల్‌క్రిస్ట్