దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ అకాల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. అతని అభిమాన గణం శోకసంద్రంలో మునిగిపోయింది. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్‌కు వెకేషన్‌కు వెళ్లిన 52 ఏళ్ల వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా వార్న్ మృతికి బరువు తగ్గి స్లిమ్‌గా మారాలనే కోరికే కారణమైందని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్ తెలిపాడు. బరువు తగ్గాడానికి వార్న్ అర్థం పర్థం లేని దారుణమైన డైట్‌లు ఫాలో అయ్యాడని చెప్పాడు. మరణానికి ముందు 14 రోజులగా కేవలం జ్యూస్‌లు, ఇతర పానీయాలు మాత్రమే ఆహారంగా తీసుకున్నట్లు జేమ్స్ పేర్కొన్నాడు.
ఇలా కేవలం ద్రవరూపంలో ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవడాన్ని లిక్విడ్ డైట్ అంటారు. బరువు తగ్గేందుకు పాటించే కఠినమైన డైట్లలో ఇది ఒకటి. కాగా తాను గతంలో ఉన్నట్లు ఫిట్‌గా మారబోతున్నట్లు వార్న్ కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. అలాగే మన దేశంలో కూడా చాలా మంది అధికబరువుతో బాధపడుతూ.. బరువు తగ్గేందుకు చాలా రకాల డైట్లు ఫాలో అవుతుంటారు. మన శరీర బరువు, వయసును దృష్టిలో ఉంచుకుని మాత్రమే బరువు తగ్గే ప్రక్రియను ఫాలో అవ్వాలని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. త్వరగా బరువు తగ్గేందుకు ఏ డైట్‌ను కూడా అతిగా పాటించవద్దని సూచిస్తున్నారు. మరి వార్న్ లిక్విడ్ డైట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ahh….must’ve been the “extreme liquid diet”that gave Shane Warne his heart attack… pic.twitter.com/gwzu9QHCtN
— Opinionated mum/Mother of Hope (@74motherofhope) March 6, 2022