Legends League Cricket: మాజీ క్రికెటర్లు తమలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకునే వేదిక లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ). ఈ ఏడాది జనవరిలో ఎల్‌ఎల్‌సీ తొలి సెషన్‌ను పూర్తి చేసుకుంది. అదేవిధంగా వచ్చే సెప్టెంబర్‌లో రెండో సీజన్ ప్రారంభం కానుంది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్‌తో భారత లెజెండ్స్ ఎలెవన్ పోటీ పడనుంది. ఈ క్రమంలో లెజెండ్స్ లీగ్ గురుంచి కీలక అప్ డేట్ వచ్చింది. హర్షల్ గిబ్స్ పై వేటు పడినట్లు సమాచారం. కశ్మీర్ లీగ్‌లో ఆడడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
మొదటి సీజన్ పోటీలు ఒమన్ వేదికగా జరిగినప్పటికీ.. భారత్ నుంచీ అద్భుత స్పందన వచ్చింది. దీంతో రెండో సెషన్ పోటీలను స్వదేశంలోనే నిర్వహించాలని ఎల్‌ఎల్‌స్ కమిటీ తీర్మానించింది. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉన్న భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా రెండో సీజన్‌లో పాల్గొనబోతున్నాడు. భారత లెజెండ్స్ ఎలెవన్ కు గంగూలీయే సారధ్యం వహించనున్నాడు. ఇక.. అసలు విషయంలోకి వెళ్తే.. తొలుత ఈ టోర్నీకి ప్రకటించిన వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్ జట్టులో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్‌కి కూడా చోటు దక్కింది. అయితే హర్షల్ గిబ్స్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన కశ్మీర్ టీ20 లీగ్‌లో పాల్గొన్నాడు.
Yuvraj Singh getting ready for legends league #LegendsLeagueCricket #CricketTwitter #AsiaCup2022 #AsiaCup pic.twitter.com/TYKxKstXB5
— DD Sports (@Mahesh13657481) August 16, 2022
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కశ్మీర్ లీగ్‌లో ఎవ్వరూ పాల్గొనకూడదని బీసీసీఐ, ప్రపంచదేశాల క్రికెటర్లను సూచించింది. అయితే.. గిబ్స్ మాత్రం దాన్ని లెక్కచేయకుండా.. తనను క్రికెట్ ఆడకుండా బీసీసీఐ భయపెడుతోందని.. క్రికెట్‌నీ, రాజకీయాలను ముడిపెట్టకండని వారించి మరీ కశ్మీర్ లీగ్‌లో పాల్గొన్నాడు. దీంతో కశ్మీర్ లీగ్ ఆడిన గిబ్స్‌కి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో చోటు ఇవ్వడంపై గంగూలీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ మ్యాచ్ నుండి గిబ్స్‌ని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అతని స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కి చోటు కల్పించింది. అలాగే సనత్ జయసూర్య స్థానంలో డానియల్ వెటోరీకి వరల్డ్ జెయింట్స్‌లో చోటు దక్కింది.
ఇండియా మహారాజాస్ టీమ్:
సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మొహమ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, ఎస్ బద్రినాథ్, పార్థీవ్ పటేల్(వికెట్ కీపర్), శ్రీశాంత్, ఎస్ బిన్ని, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, ఆర్‌ఎస్ సోధి.
వరల్డ్ జెయింట్స్ టీమ్:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), సిమన్స్, షేన్ వాట్సన్, జాక్వస్ కలిస్, డానియల్ వెటోరి, పిరియర్(వికెట్ కీపర్), నాథన్ మెక్‌కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీథరణ్, డెయిల్ స్టెయిన్, హామిల్టన్, మోర్తాజా, అస్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్‌లీ, కెవిన్ ఓబ్రైన్, దినిష్ రామ్‌దిన్(వికెట్ కీపర్).
ఇదీ చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. అప్పుడే కామెంట్స్ మొదలెట్టిన పాక్ క్రికెటర్!
ఇదీ చదవండి: వీడియో: త్రో బౌలింగ్ వేశాడు! పాక్ బౌలర్ యాక్షన్‌పై స్టోయినీస్..