లీడ్స్‌లో భారత్ పోరాటం కొనసాగుతోంది. భారీ స్కోర్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రోహిత్ ఔటయ్యాక పుజారా, కోహ్లీ బ్యాటింగ్‌తో మ్యాచ్‌పై ఆశలు పెరిగాయి. ఎప్పుడూ లేనివిధంగా పూజారా అటాకింగ్ మోడ్‌లో కనిపించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి 215/2 స్కోరుతో మ్యాచ్‌పై ఆశలు సజీవంగా నిలిచాయి. చాలా రోజుల తర్వాత పూజారా సెంచరీతో అలరిస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 91 పరుగుల స్కోర్‌తో నాలుగో బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా అదే స్కోర్ వద్ద రోబిన్‌సన్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుతిరిగాడు. ఇంకా, టీమిండియా చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఇప్పటికీ మ్యాచ్ చేయిదాటిపోలేదనే చెప్పవచ్చు.