వెస్టిండీస్ క్రికెట్ జట్టు అంటే గతమెంతో ఘనం అన్న సమెత గుర్తుకు వస్తుంది. క్రికెట్‌లో వన్డే వరల్డ్ కప్ పుట్టిన తర్వాత తొలి రెండు వరల్డ్ కప్‌లను నెగ్గి క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన జట్టు.. ఇప్పుడు వన్డేల్లో 10వ స్థానంలో ఉంది. ఇలాంటి ఆధ్వాన పరిస్థితుల్లో ఉన్న కరేబియన్ క్రికెట్‌ను గాడిలో పెట్టి, పూర్వవైభవం తెచ్చేందుకు విండీస్ క్రికెట్ బోర్డు చాలా కాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రెయిన్ లారాను వెస్టిండీస్ జట్టు పర్ఫార్మెన్స్ మెంటర్‌గా నియమించింది. ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి, టాలెంటెడ్ ఆటగాళ్లకు కొదవలేని వెస్టిండీస్ జట్టు.. ప్రపంచ క్రికెట్‌లో రోజురోజుకు దిగజారిపోతుండటంపై సగటు క్రికెట్ అభిమాని కూడా తట్టుకోలేకపోతున్నారు. కనీసం లారా రాకతోనైనా విండీస్ పరిస్థితిల్లో మార్పు వస్తుందని భావిస్తున్నారు.
అసలు వెస్టిండీస్‌కు ఈ పరిస్థితి రావడానికి టాలెంటెడ్ క్రికెటర్లు లేకకాదు. ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్ విన్నర్లు ఉన్న జట్టు వెస్టిండీస్. సరిగ్గా ఎంపిక చేయాలనే కానీ.. టీ20ల్లో విండీస్ టీమ్ ఒక్కటే జట్టు ప్రపంచంలో లేదనే చెప్పాలి. కానీ.. అలాంటి జట్టు టీ20 వరల్డ్ కప్ 2022లో కనీసం క్వాలిఫైయర్స్‌ను కూడా దాటలేక పరువు పోగొట్టుకుంది. అందుకు కారణం.. చాలా మంది స్టార్ క్రికెటర్లు, మ్యాచ్ విన్నర్లు జట్టుకు దూరం కావడమే. ప్రపంచంలో ఏ మూలన టీ20 లీగ్ జరిగినా.. అదరగొట్టేది, అత్యధిక డిమాండ్ ఉండేది విండీస్ ఆటగాళ్లకే. కానీ.. జాతీయ జట్టుకు వచ్చేసరికి మాత్రం వాళ్లు కనిపించరు. సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, హెట్‌మేయర్ లాంటి ఆటగాళ్లు విండీస్ క్రికెట్ బోర్డుతో వివాదాలతో జట్టుకు దూరం అయ్యారు.
దీంతో టీమ్ ప్రదర్శనపైయ తీవ్ర ప్రభావం పడింది. ఆర్థిక ఇబ్బందులతో తాము జాతీయ జట్టును వీడి విదేశీ లీగ్స్‌లో ఆడుతున్నామని ఆటగాళ్లే స్వయంగా వెల్లడించాడు. ఆటగాళ్లు సరిగా వేతనాలు ఇవ్వకుండా, ఆర్థిక వనరులను సమకూర్చుకోకుండా విండీస్ బోర్డు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంది. తమకు జీతాలు చెల్లించాలిన ఒకానొక దశలో కరేబియన్ ఆటగాళ్లు ధర్నకు సైతం దిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఆటగాళ్లు తమ దారి తాము చూసుకున్నారు. క్రికెట్ బోర్డు తమను ఆర్థికంగా సరిగా చూసుకుని ఉండి ఉంటే.. విండీస్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని క్రికెటర్లు పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచిన విండీస్ క్రికెట్ బోర్డు లారాను మెంటర్‌గా నియమించింది. అలాగే.. ఆటగాళ్ల విషయంలో తమ వైఖరి మార్చుకుంటే.. విండీస్‌కు పూర్వవైభవం రావడం పెద్ద కష్టమేమి కాదు. కానీ.. లారా ఒక్కడితోనే అది సాధ్యం కాదు.. క్రికెట్ బోర్డు కూడా మారాలి. అప్పుడు ఒకప్పటి విండీస్‌ను ప్రపంచం చూస్తుంది.
🚨 Brian Lara has been appointed as a performance mentor to work with West Indies’ international teams across formats
His first assignment will be with the Test squad 👉 https://t.co/m9Z0MGddh6 pic.twitter.com/FCc1D2ubtM
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2023