క్రికెట్‌లో కొన్నిషాట్లు ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ వినోదాన్ని అందిస్తూ.. బౌలర్‌కు కోపం తెప్పించే షాట్లు కూడా కొన్ని ఉంటాయి. కానీ.. ఈ షాట్ మాత్రం అసలు నమ్మశక్యంకాని రీతిలో ఉంది. జెస్ట్ అలా పంచ్ చేస్తే.. వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ షాట్‌ను చూసిన క్రికెట్ అభిమానలు, మాజీ క్రికెటర్లు షాట్ ఆఫ్ ది ఇయర్‌గా కొనియాడుతున్నాడు. అంతలా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న, అలరించిన ఈ షాట్‌ను వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ కైల్ మేయర్స్ ఆడాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్రీన్ బౌలింగ్‌లో స్వీపర్ కవర్స్ మీదుగా కొట్టిన పంచ్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను, క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య క్వీన్స్‌లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ అద్భుతమైన షాట్ చోటుచేసుకుంది. ఆసీస్ బౌలర్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని కైల్ మేయర్స్ అద్భుతమైన పంచ్‌తో సిక్స్ బాదాడు. ఆ షాట్ చూసిన వారు ఎవరైనా అది సిక్స్ వెళ్తుందని ఊహించరు. కానీ.. అది అలా అలా బుల్లెట్ వేగంతో వెళ్లి స్టాండ్స్‌లో పడింది. కైల్ ఆ బాల్‌పై చేసిన టైమింగ్‌తోనే అది అంత భారీ సిక్స్‌గా మారింది. మంచి బాల్‌ను కైల్ ఇలా స్వీపర్ కవర్స్ మీదుగా ఆడిన షాట్ నిజంగా సూపర్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 39, ఓడియన్ స్మిత్ 27 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో హెజల్‌వుడ్ 3, స్టార్క్ 2, కమిన్స్ 2, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా.. ఈ నామమాత్రపు స్కోర్‌ను ఛేదించడంలో ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడింది. విండీస్ బౌలర్ కాట్రెల్ ఆరంభంలోనే వార్నర్(14), మిచెల్ మార్ష్(3)లను అవుట్ చేసి ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఆ వెంటనే మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్ డకౌట్ కావడంతో ఆస్ట్రేలియా 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సొంత గడ్డపై విండీస్ చేతిలో ఓడిపోయేలా కనిపించింది. కానీ.. కెప్టెన్ ఆరోన్ ఫించ్(58), వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్(39 నాటౌట్) ఆస్ట్రేలియాను ఓటమి కోరల్లోంచి బయటపడేశారు. చివరికి 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్లతో ఆసీస్ విజయం సాధించింది.
Shot of the year! 🤯🤯🤯pic.twitter.com/h658wEQjzZ
— Atishay Agarwal (@sportsontoast) October 5, 2022
ఇది కూడా చదవండి: రోహిత్ పేరిట అత్యంత చెత్త రికార్డు! ప్రపంచంలోనే తొలి ప్లేయర్