ఐపీఎల్ 2021 రెండో దశలో అబుదాబి వేదికగా ఈ నెల 20న కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఘోరంగా ఓడిపోయిన విషయం కూడా విధితమే. కాకుంటే ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న మరో ఇంట్రస్టింగ్ సీన్ ఆర్సీబీ పేసర్ కైల్ జెమీసన్- మసాజ్ ధెరపిస్ట్ నవ్‌నీత గౌతమ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్. సపోర్టింగ్ స్టాఫ్‌ను జెమీసన్ ఫ్లర్ట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చిరు నవ్వులు చిందిస్తున్న ఫోటో నెట్లో చక్కర్లు కొట్టింది. దీంతో అసలు ఏవరీ అమ్మాయి అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. ఆర్సీబీ జట్టులో ఆమె ఏం చేస్తుంది. ఎప్పటి నుంచి ఉంది అనే విషయాలు తెలుకునేందుకు తెగ ఆరాటపడ్డారు.దీంతో ఆమె ఆర్సీబీ జట్టుతో చేరేటప్పుడు చెప్పిన విషయంతో మొత్తం కథ తారుమరైంది. కెనడాకు చెందిన నవ్‌నీత గౌతమ్ 2019లో ఆర్సీబీ జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్‌గా వచ్చింది. అంతకు ముందు మరే ఐపీఎల్ జట్టుకు లేడీ మసాజ్ థెరపిస్ట్ లేదు. ఆర్సీబీ జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో ఆమె ఒక్కతే అమ్మాయి. 2019లో ఆమె జాయిన్ అయిన సమయంలో మీరొక్కరే అమ్మాయి మిగతా వారంతా అబ్బాయిలు కదా ఎలా అనిపిస్తుంది అని ఎవరో ప్రశ్నిస్తే. నా చుట్టూ 20 మంది అన్నాదమ్ములు ఉన్నట్లు ఉంది. ఇది నా వృత్తి ఇందులో ఆడమగ తేడాలెందుకు అని సమాధనం ఇచ్చింది. సో దీన్ని బట్టి జెమీసన్‌ను కూడా అన్న కిందే లెక్కెసింది. గౌతమ్ గతంలో ఇండియన్ నేషనల్ విమెన్స్ బాస్కెట్ బాల్ జట్టుకు కూడా థెరపిస్ట్‌గా పని చేసింది.