చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. అదే విధంగా బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే భారత బౌలర్లు ఆలౌట్ చేయడంతో.. టీమిండియా 254 పరుగుల మంచి లీడ్ దక్కింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి మూడు చివరి సెషన్‌లో మరో 12 ఓవర్లు మిగిలి ఉండగా.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 513 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. అయితే మూడో రోజు వికెట్ నష్టపోకుండా ఆడిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఉదయం కూడా వికెట్ కోల్పోకుండా.. 100 పరుగుల మార్క్‌ను దాటింది. దీంతో మ్యాచ్‌పై బంగ్లాదేశ్ ఆశలు పెంచుకుంటోంది.
కాగా.. మూడో రోజు ఆటముగిసిన తర్వాత టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ సమావేశంలో ఒక రిపోర్ట్ అత్యుత్సాహం చూపిస్తూ.. ఒక పిచ్చి ప్రశ్నను కుల్దీప్ యాదవ్‌కు సంధించాడు. దానికి కుల్దీప్ ఇచ్చిన సమాధానంతో సమావేశం హాల్ అంతా నవ్వులు చిందించింది. 513 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించడంలో టెస్టుల్లో ఇంతవరకు జరగలేదు. దాదాపు అది అసాధ్యమే. పైగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌటైన జట్టు.. అంత భారీ టార్గెట్ ఛేదిస్తుందని ఎవరూ అనుకోరు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా ఆలోచించి ఉండరేమో. మహా అయితే డ్రా కోసం ఆడేందుకు ప్రయత్నిస్తారు.
అలాంటి ఆ రిపోర్ట్ మాత్రం బంగ్లాదేశ్ గెలుస్తుందని మీకు అనిపించడంలేదా? అని కుల్దీప్ యాదవ్‌ను అడిగాడు. ఏ ఆటగాడైనా ప్రత్యర్థి జట్టు గెలుస్తుందని, గెలవాలని అనుకోడు.. అలాంటిది, తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ ఎందుకు అనుకుంటాడు. ఈ ప్రశ్నతో కుల్దీప్‌కు సైతం మండినట్టుంది. అందుకే.. కుల్దీప్ బదులిస్తూ..‘నేనైతే అలా జరగొద్దని కోరుకుంటున్నా.. ఏమో బంగ్లా బ్యాటర్లలో ఎవరో ఒకరు ట్రిపుల్ సెంచరీ చేస్తే మీరు అన్నది జరగొచ్చు.. నేను మాత్రం వారిని త్వరగా ఆలౌట్ చేసేందుకు చూస్తాను’ అని చాలా హ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో అక్కడున్న మిగతా రిపోర్టర్లు నవ్వుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న బౌలర్ ఎవరైనా.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి 513 ఛేజ్‌చేస్తుందని భావిస్తాడా? అంటూ నెటిజన్లు సైతం ఆ రిపోర్టర్‌పై సెటైర్లు వేస్తున్నారు. మరి రిపోర్ట్ ప్రశ్నకు కుల్దీప్ ఇచ్చిన ఆన్సర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Third five-wicket haul for Kuldeep Yadav in Tests 👏#BANvIND | #WTC23 | 📝 https://t.co/ym1utFHoek pic.twitter.com/VFQ9ugi3s7
— ICC (@ICC) December 16, 2022