లక్నో వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్.. స్పిన్నర్ల మధ్య పోటీగా మారింది. టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్లే ఇన్ని ఓవర్లు వేయడం ఇదే తొలి సారిలా ఉంది. ఇరు జట్లలోనూ ఏకంగా నలుగురు స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగారు. భారత్ 13 ఓవర్లును స్పిన్ బౌలర్లతో వేయిస్తే, న్యూజిలాండ్ ఏకంగా 17 ఓవర్లు స్పిన్నర్లతోనే పూర్తి చేసింది. దీనికి కారణం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడమే. ఇలాంటి పిచ్‌పై స్పిన్నర్లు పండగ చేసుకుంటే.. బ్యాటర్లు వణికిపోయారు. 20 ఓవర్లలో 99 పరుగులు చేసేందుకు కివీస్ బ్యాటర్లు నానా కష్టాలు పడితే.. ఆ టార్గెట్‌ను ఛేదించేందుకు భారత్ బ్యాటర్లు చెమటలు కక్కారు. ఇరు దేశాల స్పిన్నర్లు చెలరేగగా.. భారత బ్యాటర్లు కాస్త మెరుగ్గా, క్వాలిటీ స్పిన్‌ను గౌరవిస్తూ.. ఆడి విజయం అందుకున్నారు.
అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్, రిస్ట్ మెజీషియన్ కుల్దీప్ యాదవ్ వేసిన ఒక బాల్ మాత్రం హైలెట్‌గా నిలిచింది. ఆ సూపర్ డెలవరీని క్రికెట్ ప్రపంచం ‘బాల్ ఆఫ్ ది ఇయర్’గా కీర్తిస్తోంది. కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో 4,5వ బంతులను డార్లీ మిచెల్ పరుగులు చేయలేకపోయాడు. మిచెల్ ఒత్తిడిలో ఉన్నాడని గమనించిన కుల్దీప్.. ఇదే అదునుగా భావించి తన అద్భుతమైన బాల్ వేశాడు. అంతే.. అప్పటికే రెండు డాట్లు ఆడిన మిచెల్‌కు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయింది. ఇక్కడో అవుట్ సైడ్‌ది ఆఫ్‌స్టంప్‌లో పడిన బాల్.. భారీ టర్న్ తీసుకుంటూ.. ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. కుల్దీప్ వేసిన బాల్‌కు అవుటైన మిచెల్ సైతం.. ఆ బాల్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. కుల్దీప్‌ను అభినందిస్తూ.. పెవిలియన్ బాట పట్టాడు.
కుల్దీప్ వేసిన ఆ అద్భుతమైన డెలవరీతో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ గుర్తుకు వచ్చాడంటూ.. షేన్ వార్న్ కుల్దీప్ రూపంలో ఇంకా బతికే ఉన్నాడంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. వార్న్ సైతం ఇలాంటి అద్భుతమైన బాల్స్ ఎన్నో వేసి.. బ్యాటర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. కుల్దీప్ సైతం గతంలో ఇలాంటి సూపర్ డెలవర్సీతో బాబర్ అజమ్‌ను రెండు సార్లు అవుట్ చేశాడు. కుల్దీప్ ఇలాంటి బాల్ వేస్తే.. ప్రపంచంలో ఎంత గొప్ప బ్యాటర్ అయినా సరే వికెట్ సమర్పించుకోవాల్సిందే అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి కుల్దీప్ వేసిన ‘బాల్ ఆఫ్ ది ఇయర్’ డెలవరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kuldeep Yadav spun that a mile 🕸️
(via @BCCI) | #INDvNZ pic.twitter.com/jazTUgHz7y
— ESPNcricinfo (@ESPNcricinfo) January 29, 2023