హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న కొన్ని ప్రధాన, పెద్ద ఫ్లైఓవర్ల కింద క్రికెట్ బాక్స్ లను ఏర్పాటు చేయనున్నట్లు తన ట్వీటర్ ఖాతా ద్వారా తెలిపారు.
భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ ను ఓ ఆటగా కాకుండా దాన్ని ఓ ఎమోషన్ గా భావిస్తారు ఇక్కడి అభిమానులు. ఇక ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అందుకు తగ్గట్లుగానే ప్రాధాన్యం ఇస్తూ.. ముందుకు పోతున్నాయి. అయితే ప్రధాన నగరాల్లో క్రికెట్ ఆడటానికి గ్రౌండ్స్ లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి హైదరాబాద్ లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు.
హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సిటీలో క్రికెట్ ఆడటానికి గ్రౌండ్స్ లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు యువత. ఈ సమస్యకు పరిష్కారం చూపించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఉన్న కొన్ని ప్రధాన, పెద్ద ఫ్లైఓవర్ల కింద బాక్స్ క్రికెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తన ట్వీటర్ ఖాతా ద్వారా తెలిపారు. ట్వీటర్ లో ముంబాయికి చెందిన ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ఈ ఐడియా బాగుందని, హైదరాబాద్ లోని కొన్ని ఫ్లైఓవర్ల కింద ఇలాంటి క్రికెట్ బాక్స్ లను ఏర్పాటు చేస్తామని, ఇది అద్భుతమైన ఆలోచన అంటూ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను ట్యాగ్ చేస్తూ తెలిపారు.
ఈక్రమంలోనే ఫ్లైఓవర్ల కింద క్రికెట్ బాక్స్ లను ఏర్పాటు చేయడం వల్ల యువతకు మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని హైదరాబాద్ వాసులు అంటున్నారు. ఇక ఇప్పటికే నగరంలో బాక్స్ క్రికెట్ సంస్కృతి విస్తరించింది. చాలా చోట్ల ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్స్ వెలిశాయి. మరి ఫ్లైఓవర్ల కింద క్రికెట్ బాక్స్ లను ఏర్పాటు చేయడంపై ఓ క్రికెట్ అభిమానిగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Let’s get this done in a few places in Hyderabad @arvindkumar_ias
Looks like a nice idea https://t.co/o0CVTaYxqb
— KTR (@KTRBRS) March 27, 2023