గెలవాలంటే చివరి ఓవర్లో 15 పరుగులు చేయాలి. మొదటి బంతికి నాలుగు పరుగులు వచ్చాయి. రెండో బంతికి రెండు, మూడో బంతికి ఒక్క పరుగు. ఇక 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతి డాట్ అయింది. దాంతో బౌలర్ నవ్విన వెటకారపు నవ్వు బ్యాట్స్‌మెన్‌లో కసిని పెంచింది. ఎంతలా అంటే చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించేశాడు. ఈ ఉద్వేగ సంఘటన శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ తెలుగు తేజం కేఎస్ భరత్ కోపానికి బలైంది మాత్రం ఢిల్లీ బౌలర్ ఆవేశ్ ఖాన్. చివరి ఓవర్లో ఒక్క బంతిని భరత్ మిస్ చేయడంతో వెటకారపు నవ్వు నవ్వి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 78 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన భరత్ చివరి బంతికి సిక్స్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు.
ఈ మ్యాచ్ ఫలితంతో పాయింట్స్ టేబుల్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేకున్నా మ్యాచ్ మాత్రం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(48), శిఖర్ ధావన్(43) మంచి ఆరంభాన్ని అందించారు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్లు పడిక్కల్(0), కోహ్లీ(4) వికెట్లను కోల్పోయింది. అనంతరం భరత్, డెవిలియర్స్(26) ఇన్నింగ్స్‌ను సక్కదిద్దారు. మ్యాక్స్‌వెల్ ఈ ఐపీఎల్ మరో ఫిఫ్టీ చేస్తూ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 3 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది.
Great Scenes from the #RCB camp as KS Bharat finishes it off in style by hit a six on last ball. Virat Kohli’s celebration is awesome 😎#KSBharat #RCBvDC #RCBvsDC #DCvRCB #DCvsRCB #IPL2021pic.twitter.com/NPztmaSWZN
— ABDULLAH NEAZ (@AbdullahNeaz) October 9, 2021