ఆటలో ఉండే భావోద్వేగం కోపాన్ని, బాధను, కష్టాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది. క్రీడల్లో ఉండే మ్యాజిక్ అదే. అందుకే మనదేశంలో కులమత ప్రాంతాలకు అతీతంగా అభిమానించేది ఒక్క క్రికెట్‌ను మాత్రమే. ఇలాంటి ఆట ఇప్పుడు ఇద్దరు శత్రువులను మిత్రులుగా మార్చింది. రెండేళ్ల క్రితం విభేదాలతో రచ్చకెక్కిన కృనల్ పాండ్యా, దీపక్ హుడా ఇప్పుడు ఒక్కటయ్యారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఎలాంటి సెటిల్‌మెంట్ చేయకుండానే… ఆట వాళ్లను కలిపేసింది. ఈ అరుదైన సంఘటన ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
2020 దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకారణంగా తనపై నోరు పారేసుకున్నాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్‌లో పెనుదుమారం రేపింది. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ విచారణ చేపట్టింది. తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది.
అయితే ఐపీఎల్ 2022 సీజన్ రూపంలో మళ్లీ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లను కొనుగోలు చేసింది. ముందుగా దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు తీసుకున్న లక్నో.. ఆ తర్వాత కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మిడిలార్డర్లో కీలకం కానున్న ఈ ఇద్దరూ కలిసి ఆడాల్సి వస్తే.. వీరి విబేధాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలను దూరం చేస్తూ.. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు ఆటగాళ్లు ఒక్కటయ్యారు. వీరి కలయికపై క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం పాండ్యా, హుడా హగ్ చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి వీరిద్దరి మధ్య వివాదం, కలిసిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా మార్కులు కొట్టేసిన మయాంక్! మ్యాచ్ గెలిచినందుకు కాదు..
Hug between Krunal Pandya and Deepak Hooda. pic.twitter.com/m49lTzZYte
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.